పెట్రోల్ ధరలు పెంచి సామాన్యుల నడ్డి విరుస్తున్న కేంద్రం

  • : సిపిఐ మండల నాయకులు మంద భాస్కర్

విశ్వంభర, కేసముద్రం: కేంద్రంలోని బిజెపి నేతృత్వంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం ధరలు పెంచి మూడు రోజులు కాకముందే మరోసారి పెట్రోల్, డీజిల్ ధరలను పెంచి సామాన్య ప్రజల నడ్డి విరిచిందని సిపిఐ మండల నాయకులు మంద భాస్కర్ అన్నారు. బుధవారం కేసముద్రం మున్సిపాలిటీ  కేంద్రంలో ఒక ప్రకటన విడుదల చేస్తూ పెట్రోల్ డీజిల్ ధరలను ఒక వైపు తగ్గించాలని ప్రజలు ఆందోళన చేస్తుండగా మళ్లీ ధరలు పెంచడం దారుణం అన్నారు. ఇప్పటికే పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలతో ఇబ్బంది పడుతున్న సామాన్యులు తాజాగా పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలతో  పేద, మధ్యతరగతి ప్రజలపై మరింత భారం పెరిగిందని అన్నారు. పెట్రోల్ ధరల పెంపుతో రవాణా నిత్యవసర సరుకులు ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. కార్పొరేట్ వర్గాలకు కేంద్రాల్లోని నరేంద్ర మోడీ ప్రభుత్వం ఊడిగం చేస్తూ పేదల సంక్షేమాన్ని విస్మరిస్తుందని విమర్శించారు. ప్రజా సంక్షేమాన్ని విస్మరించి కార్పొరేట్ శక్తులకు దాసోహం  అయిందని అన్నారు. పెట్టుబడిదారులకు కార్పొరేట్లకు అనేక రాయితీలిస్తూ పేద, మధ్యతరగతి ప్రజలపై భారం మోపడం సరైంది కాదన్నారు. ఇది ప్రజా సంక్షేమాన్ని కోరుకునే ప్రభుత్వమా లేక ప్రజలను నిలువు దోపిడీ చేసే ప్రభుత్వమా అని ప్రశ్నించారు. పెంచిన పెట్రోల్, డీజిల్ గ్యాస్ ధరలను తగ్గించకపోతే ప్రజాగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు.

🕒 21 May 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/it-is-a-center-where-petrol-prices-are-increased-and/article-15608

Tags: