శిబిరానికి దాతల సహకారం అభినందనీయం
విశ్వంభర, ఇనుగుర్తి: వేసవి శిబిరానికి చేయూతనిస్తున్న దాతల సహకారం అభినందనీయమని దిశ కమిటీ సభ్యులు గుజ్జునూరి బాబురావు, విద్యాభివృద్ధి కమిటీ చైర్మన్ దార్ల రామ్మూర్తి, పరుపాటి దేవేందర్ రెడ్డి, కర్ర మధుసూదన్ రెడ్డి, బోల్ల కొమురయ్య లు అన్నారు. మండల కేంద్రం ఇనుగుర్తి జిల్లా పరిషత్ హై స్కూల్ లో విఈడి సి, వందేమాతరం ఫౌండేషన్, ఎన్ ఎఫ్ హెచ్సి సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వేసవి శిబిరం బాల బాలికలకు వజిన పల్లి శ్రీధర్ ఇచ్చిన రు.2వేల విరాళంతో బుధవారం అల్పాహారం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దాతల సహకారంతోనే విద్యార్థులకు వేసవి శిబిరం విజయవంతంగా కొనసాగుతున్నదని కృతజ్ఞతలు తెలిపారు. అంతకుమునుపు వాలంటీర్లు బోధనా అంశాలతో పాటు చిత్రలేఖనం,క్విజ్ పోటీలు నిర్వహించారు.