నకిరేకల్ నియోజకవర్గంలో అభివృద్ధి పరుగులు
విశ్వంభర, రామన్నపేట: గడచిన రెండున్నర ఏళ్లలో నకిరేకల్ నియోజక వర్గంలో అభివృద్ధి పరుగులు పెడుతుందని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం తెలిపారు. తన పాలనా కాలంలో సంక్షేమ పథకాలు మాత్రమే కాకుండా, వివిధ శాఖల ద్వారా మొత్తం రూ.1,200 కోట్లకు పైగా నిధులతో మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేశామని తెలిపారు. నియోజకవర్గంలోని గ్రామాల్లో సీసీ రోడ్లు, మట్టి రోడ్లు, అంగన్‌వాడీ భవనాలు, తాగునీటి సరఫరా, కాంపౌండ్ వాల్స్, కమ్యూనిటీ హాల్స్, గ్రామ పంచాయతీ భవనాలు తదితర పనులు చేపట్టామని, రూ.200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల నిర్మాణం జరుగుతుందని, అయిటిపాముల లిఫ్ట్ ఇరిగేషన్ కు రూ.101 కోట్లు, ధర్మారెడ్డిపల్లి కాలువకు రూ.124 కోట్లు, పిలాయిప్ల్లి కాలువకు రూ.84 కోట్లు, ఎస్.ఎల్.బిసి సిమెంట్ లైనింగ్ రూ.72 కోట్లు, మండలాపురం చెక్ డ్యాంకు రూ.6.5 కోట్లు, ఉరుమడ్ల పెద్ద చెరువు మరమ్మత్తుకు రూ.2 కోట్లు, పటేల్ కుంట మరమ్మత్తుకు రూ.1.50 కోట్లు, అసిఫ్ నెహర్ కాలువ మరమ్మత్తు, రూ.1.31 కోట్లు మంజూరు అయ్యాయని, పెద్ద కాపర్తి స్టేజి, చిట్యాలలో రెండు ఫ్లై ఓవర్ల నిర్మాణానికి 30 కోట్లతో పనులు జరుగుతున్నాయని, పంచాయతీరాజ్ రోడ్లు & ఇతర పనులు – రూ.50+ కోట్లు,రైతు రుణ మాఫీ, రైతు భరోసా, రైతు బీమా అన్ని పథకాలు కలిపి ఈ రెండున్నర సంవత్సరాల్లో మన రైతులకు. అందించిన మొత్తం రూ.668.72 కోట్లని, ఇంకా అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామని, సీఎం రేవంత్ రెడ్డి సహకారంతో నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నామని, రోడ్లు, సాగునీరు, విద్య, వైద్యం, తాగునీరు ప్రజలకు అందుబాటులోకి తెచ్చామని, ఇది ప్రారంభం మాత్రమేనని, రాబోయే రోజుల్లో మరింత అభివృద్ధి చేసి చూపిస్తామని, పనులు చేయలేనివారు, చేతకానివారు అభివృద్ధి పనులు జరుగుతుంటే నచ్చక ఏవేవో మాట్లాడుతుంటారని, వాటిని పట్టించుకోవద్దని, ప్రజల బాగోగులే తనకు ముఖ్యం తప్ప, పనిలేని విమర్శలకు సమాధానం చెప్పడం తన పని కాదని పేర్కొన్నారు.