ధాన్యం కొనుగోలు లో ప్రభుత్వo విఫలం
కొనుగోలు కేంద్రాల్లో రైతుల పడిగాపులు
బి ఆర్ ఎస్ నాయకులు అయిలేని మల్లికార్జున్ రెడ్డి, సుద్దాల చంద్రయ్య
విశ్వంభర, హుస్నాబాద్: రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లనే రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని హుస్నాబాద్ బిఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ నాయకులు అయిలేని మల్లికార్జున్ రెడ్డి , సుద్దాల చంద్రయ్య ఆరోపించారు. హుస్నాబాద్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వాళ్ళు మాట్లాడుతూ రైతులు అనేక కష్టనష్టాలను ఎదుర్కొని పండించిన పంటను అమ్మేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలకు వెళ్తే అక్కడ అడుగడుగునా సమస్యలు ఎదుర్కొంటున్నారని తెలిపారు. హుస్నాబాద్ నియోజకవర్గం వ్యాప్తంగా ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే పదిహేను రోజుల పాటు రాత్రింబవళ్లు గడపాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు.మొక్కజొన్న ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభమై నెలన్నర దాటినా ఇప్పటికీ దాదాపు ఇరవై శాతం ధాన్యం కేంద్రాల్లోనే ఉండిపోయిందని పేర్కొన్నారు. ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు.తరుగు పేరిట మిల్లర్లు రైతులను దోపిడీ చేస్తుంటే ప్రభుత్వం మౌనంగా ఉండటం దారుణమన్నారు. రైతుల సమస్యలను తెలుసుకునేందుకు మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్ పర్యటిస్తే, మంత్రి పొన్నం తట్టుకోలేక కాంగ్రెస్ నాయకులతో ఆయనపై విమర్శలు చేయిస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.హుస్నాబాద్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసిన ఘనత పూర్తిగా మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్‌దేనని పేర్కొన్నారు. కాంగ్రెస్ నాయకులు అనవసర విమర్శలు మానుకుని ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని నియోజకవర్గ అభివృద్ధిపై దృష్టి పెట్టాలని సూచించారు. లేకపోతే రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీపై ప్రజల తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు. ఈ సమావేశంలో బి ఆర్ ఎస్ పార్టీ సీనియర్ నాయకులు బూర వెంకన్న గౌడ్, దొంతబోయిన శ్రీనివాస్, పూదరి సంపత్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.