రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
- మరో ఇద్దరికి తీవ్ర గాయాలు
విశ్వంభర, నెల్లికుదురు: అజాగ్రత్తగా నిలిపి ఉంచిన ట్రాక్టర్ ట్రాలీ చీకట్లో కనపడక బైక్ ఢీకొని వ్యక్తి మృతి చెందిన ఘటన నెల్లికుదురు మండలంలో చోటు చేసుకుంది. ఎస్సై చిర్ర రమేష్ బాబు తెలిపిన వివరాలు ప్రకారం మండలంలోని రామన్న గూడెం గ్రామానికి చెందిన ముగ్గురు చందపాక జంపయ్య, చందపాక రామకృష్ణ, బుర్ర యాకూబ్ పాష పనిమీద బైకుపై మంగళవారం సాయంత్రం నెల్లికుదురుకు వెళ్లారు. తిరిగి రామన్నగూడెం వెళుతున్న క్రమంలో చెరువు కట్ట దారి మీద అదే గ్రామానికి చెందిన కాశమల్ల రవీందర్ తన ట్రాక్టర్ ట్రాలీ నిలిపి ఉంచాడు. చీకట్లో కనపడకపోవడంతో సంబంధిత బైకు ట్రాలీని ఢీ కొట్టింది. బైకు నడుపుతున్న జంపయ్య తో పాటు ముగ్గురు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి.వెంటనే అంబులెన్స్ లో మహబూబాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బుధవారం తెల్లవారుజామున చందపాక జంపయ్య(25) మృతి చెందాడు. ఈ మేరకు జంపయ్య సోదరుడు చందపాక రవీందర్ అజాగ్రత్తగా నిలిపి ఉన్న ట్రాక్టర్ ట్రాలీ కు చెందిన కాశమల్ల రవీందర్ పై చర్య తీసుకోవాలని ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.