దివ్యాంగత శరీరానికే పరిమితం .. సంకల్పానికి కాదు..

  • : ఎమ్మెల్యే మురళి నాయక్

విశ్వంభర, మహబూబాబాద్ : మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని ఎంపీపీఎస్ పాఠశాలలో భారత కృత్రిమ అవయవాల తయారీ సంస్థ (అలిన్ కో) సహకారంతో  దివ్యాంగులకు సహాయ ఉపకరణాలను పంపిణీ చేసారు. ఈ కార్యక్రమంలో  మహబూబాబాద్ ఎమ్మెల్యే  డా. భూక్య మురళి నాయక్ పాల్గొని దివ్యాంగులకు పరికరాలను  అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మేల్యే మురళి నాయక్ మాట్లాడుతూ , దివ్యాంగుల జీవితం సులభతరం కావడానికి అవసరమైన ట్రై సైకిళ్ళు, వీల్ చైర్లు, వాకింగ్ స్టిక్స్,  శ్రావణ యంత్రాలు లబ్ధిదారులకు పంపిణీ చేయడం చాలా సంతోషంగా ఉందని అన్నారు..అంతే కాకుండా ప్రభుత్వ ప్రభుత్వ సంక్షేమ పథకాలను దివ్యాంగులకు మరియు అణగారినా వర్గాలకు చేరవేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. వారికి సమాజంలో సమాన అవకాశాలు కల్పించడంలో ఇటువంటి పరికరాలు ఎంతో దోహదపడుతుందని ఆయన అన్నారు.అంతేకాకుండా ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి , నాయకత్వంలో విద్య మరియు సంక్షేమ రంగాలకు అధిక ప్రాధాన్యత ఇస్తుందని నిరుపేదలకు,దివ్యాంగులకు అందుబాటులో ఉండడమే తమ ప్రధాన బాధ్యత అని అన్నారు.....అంతేకాకుండా దివ్యాంగులు తమ దివ్యాంగతను జయించి ఐఏఎస్/ ఐపీఎస్ స్థాయికి ఎదిగిన ప్రముఖులు చాలా మందికి స్పూర్తి దయకమని ముఖ్యంగా దివ్యాంగులు గుర్తుంచుకోవాల్సింది ఒక్కటే దివ్యాంగత శరీరానికే పరిమితం కానీ తమ సంకల్పానికి కాదని పట్టుదల ,క్రమశిక్షణ , ఆత్మవిశ్వాసం ఉంటే ఏ లక్ష్యమైన సాధించవచ్చు అని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ గూగులోత్ జ్యోతి రమేష్ ,  జిల్లా విద్యాశాఖ అధికారి ఏ సత్యనారాయణమూర్తి, స్థానిక వార్డు కౌన్సిలర్ కాటా భాస్కర్, అంతేకాకుండా వివిధ వార్డుల కౌన్సిలర్ లు జిల్లా నాయకులు , పట్టణ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

🕒 21 May 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/paralysis-is-limited-to-the-body-and-not-to-the/article-15602

Tags: