మండల వ్యాప్తంగా మెడికల్ షాపుల బంద్ విజయవంతం

విశ్వంభర, చింతపల్లి: ఆన్లైన్ ఫార్మసీల (ఈ-ఫార్మసీ) అమ్మకాలను వ్యతిరేకిస్తూ ఫార్మసీ వ్యాపార సంఘాల పిలుపు మేరకు బుధవారం చింతపల్లి మండల వ్యాప్తంగా ఔషధ దుకాణాల బంద్ కొనసాగింది. ఈ బంద్ ప్రభావం ప్రజలు, రోగులపై కూడా పడింది. చింతపల్లి మండల వ్యాప్తంగా మాల్ (గొడకొండ్ల ), కుర్మేడ్, చింతపల్లి గ్రామాల్లో 25 పైగా దుకాణాలు మూతపడగా ఒక్క మెడికల్ షాపు తెరుచుకోలేదు. మెడికల్ షాపు యజమానులు చింతపల్లి ఎమ్మార్వో విజయ లక్ష్మికి వినతి పత్రం సమర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం జారీచేసిన ఆన్లైన్ మెడిసిన్ విక్రయాల నోటిఫికేషన్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. 2018 నుంచి ఇప్పటి వరకు అనేకసార్లు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు విన్నవించినా ఆన్ లైన్ మెడిసిన్ విక్రయాలు నిలిపివేయడం లేదన్నారు. వెంటనే కెమిస్ట్, డ్రగ్గిస్ట్ నిబంధనలకు వ్యతిరేకంగా కొనసాగుతున్న విక్రయాలను నిలిపివేయాలని కోరారు. వైద్యుల ప్రిస్క్రిప్షన్ లేకుండా యాంటీబయోటిక్ మందుల విక్రయాలు ప్రజలకు ప్రమాద కరమని పేర్కొన్నారు. దేశ వాప్తంగా 40 లక్షలు, రాష్ట్రంలో 14 లక్షల హోల్సేల్, రిటైల్ షాపులున్నాయని, వీటిపై ఆధారపడి కోట్లాది యువత, ప్రజలు జీవనోపాధి పొందుతున్నారని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆకుల బాలనారాయణ, చెట్లపల్లి హరిప్రసాద్, నాళ్ళ శివ కుమార్, మోర వెంకటరమణ, వెంకటయ్య, శ్రీనివాస్, అనిల్, పవన్, రవి తదితరులు పాల్గొన్నారు.

🕒 21 May 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/mandal-wide-bandh-of-medical-shops-is-successful/article-15616

Tags: