వంశీకృష్ణ పై పరిగి పోలీస్ స్టేషన్ లో  ఫిర్యాదు చేసిన బిఆర్ఎస్ నాయకులు

విశ్వంభర, పరిగి: బిఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పై మహా న్యూస్ లో వంశీకృష్ణ అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు మంచన్పల్లి ఆనంద్ ఆధ్వర్యంలో బిఆర్ఎస్ నాయకులు పరిగి పోలీస్ స్టేషన్ లో వంశీకృష్ణ పై ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా సురేందర్ మాట్లాడుతూ.. మహా న్యూస్ లో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కుటుంబ సభ్యులపై తప్పుడు అవమానకరమైన స్క్రోలింగ్స్ ప్రసారాలు చేస్తున్నారని అవి వ్యక్తి పరువుకు భంగం కలిగించడమే కాకుండా కులాల మధ్య గొడవ తీసే విధంగా కలవన్నారు. ప్రసారాల వల్ల నియోజకవర్గ ప్రజల మనోభావాలు దెబ్బతిన్నాయని భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే తక్షణమే మహా న్యూస్ యాజమాన్యం పై చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో రఫీక్, సింగం, యాదయ్య, బాలు, ఆంజనేయులు, నరేష్, రాజు, మహేష్, పవన్ కుమార్, శ్రీకాంత్ రామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు

🕒 20 May 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/brs-leaders-who-complained-against-vamsikrishna-in-parigi-police-station/article-15522

Tags: