ఆకట్టుకున్న యూత్ పార్లమెంట్

ఆకట్టుకున్న యూత్ పార్లమెంట్

విశ్వంభర, సిద్దిపేట : ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా జిల్లా యువజన క్రీడా వ్యవహారాల శాఖ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని ఇండోర్ స్టేడియంలో యువతి, యువకులతో బుధవారం యూత్ పార్లమెంట్ నిర్వహించారు. కార్యక్రమానికి జిల్లా యువజన క్రీడల వ్యవహారాల అధికారి, జిల్లా విద్యాధికారి ఎల్లంకి శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమ నిర్వహణ శిక్షణ సహకార కర్తగా జిల్లా సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుల ఫోరం వ్యవహరించింది. ఈ సందర్భంగా పార్లమెంట్ సమావేశాల మాదిరిగా జీరో అవర్, క్వశ్చన్ అవర్ బిల్లు ప్రవేశపెట్టే పద్ధతి, ఓటింగ్, వాదనలు ప్రతి వాదనలు మొదలైన విషయాలతో యూత్ పార్లమెంట్ ఆకట్టుకుంది. యువతీ యువకులు ఉత్సాహంగా పాల్గొని తమ స్పీచ్ లను వినిపించారు. యూత్ పార్లమెంట్ కార్యక్రమానికి స్పీకర్ గా సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు ఎర్రన్నగారి రాంగోపాల్ రెడ్డి వ్యవహరించగా, ప్రధానమంత్రిగా శిరీష, ప్రతిపక్ష నాయకుడిగా రాజు, మంత్రులుగా రసజ్ఞ, ఆనంది, హరికృష్ణ, నగేష్, చందన వ్యవహరించారు. వివిధ పక్షాల ఫ్లోర్ లీడర్లుగా సౌమిత్, తన్వి, అఖిల, సాయి మొదలైన వారు వ్యవహరించారు. కార్యక్రమంలో దాదాపు 70 మంది యువతీ యువకులు, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు. అనంతరం విద్యార్థినీ విద్యార్థులకు పెయింటింగ్, డాన్స్ కాంపిటీషన్ నిర్వహించారు. విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో జిల్లా సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుల ఫోరం తరపున అధ్యక్షుడు మామిడి పూర్ణచందర్ రావు, ఉపాధ్యక్షుడు బండి సమ్మయ్య, గౌరవ సలహాదారు పబ్బతి శ్రీకర్ రెడ్డి, ఇంకేసాఫ్ అలీ పాల్గొన్నారు. జ్యూరీ సభ్యులుగా గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు బాలరాజు, డిగ్రీ లెక్చరర్ మనోహర్ వ్యవహరించారు. కార్యక్రమంలో ఫిజికల్ డైరెక్టర్ ఉప్పలయ్య, స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ అధ్యక్షురాలు సౌందర్య, ఉపాధ్యాయులు రాధారి నాగరాజు, సాదత్ అలీ, వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు.

🕒 21 May 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/an-impressive-youth-parliament/article-15542

Tags: