రౌడీ షీటర్ల ఇళ్ల లో  మోకిల సి.ఐ ఆకస్మిక తనిఖీలు

విశ్వంభర, శంకర్‌పల్లి:  మోకిల సి.ఐ శ్రీనివాస్ రెడ్డి బుధవారం మోకిల పోలీస్ స్టేషన్ పరిధిలోని పలు గ్రామాల్లో రౌడీ షీటర్లు, సస్పెక్ట్ షీటర్ల ఇళ్లకు వెళ్లి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా సి.ఐ మాట్లాడుతూ, ఇకపై ఎలాంటి నేర కార్యకలాపాలు లేదా కేసుల్లో పాల్గొనకుండా సత్‌ప్రవర్తనతో సమాజంలో మంచి పౌరులుగా జీవించాలని సూచించారు. చట్టవ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని హెచ్చరిస్తూ, పోలీస్ శాఖ నిత్యం నిఘా కొనసాగిస్తోందని తెలిపారు. అనుమానాస్పద కార్యకలాపాలు గమనించిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. శాంతి భద్రతల పరిరక్షణలో ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు.

🕒 21 May 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/knee-jerk-ci-raids-at-homes-of-rowdy-sheeters/article-15590

Tags: