ఉద్యోగ క్యాలెండర్‌ను వెంటనే ప్రకటించాలి:- నిరుద్యోగ జేఏసీ
విశ్వంభర, ముషీరాబాదు : గ్రూప్-1, మెగా డీఎస్సీ తదితర పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే నిరుద్యోగుల కోసం ప్రభుత్వం నుండి స్పష్టమైన షెడ్యూల్, ఉద్యోగ క్యాలెండర్‌ను వెంటనే ప్రకటించాలని నిరుద్యోగ జేఏసీ నాయకురాలు అస్మా డిమాండ్ చేశారు. నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు అమలు కావడం లేదని, ఇచ్చిన మాట ప్రకారం నోటిఫికేషన్లు, జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో హైదరాబా దు ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద బుధవారం నిరుద్యోగ ఆవేదన సభనిర్వహించారు. ఈ సందర్భంగా నిరుద్యోగ జేఏసీ నాయకురాలు అస్మా మాట్లాడుతూ రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ప్రభుత్వం మోసగించిందని విమర్శించారు. రెండున్నర ఏళ్లలో ఒక్క నోటిఫికేషన్ లేదన్నారు.డీఎస్సీ, గురుకుల ,మోడల్ స్కూల్, జేయల్, డిఎల్అన్ని కలిపి జంబో నోటిఫికేషన్ ఇవ్వాలన్నారు.అదేవిధంగా 20వేల పోలీసు ఉద్యోగాలు గ్రూప్స్ నోటిఫికేషన్ జిపిఓ,ఎఫ్ బి ఓ, పవర్ సెక్టర్ వంటి అన్ని నోటిఫికేషన్లు జూన్ రెండో తేదీ లోపు ప్రకటించని పక్షంలో తెలంగాణ నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో రాష్ట్రంలో ఖాళీల భర్తీ జాబ్ క్యాలెండర్, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగ హామీల అమలు కోసం నిరంతరం పోరాటాలు కొనసాగిస్తామని హెచ్చరించారు.తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమాన్ని తలపించేలా రాష్ట్రమంతటా పర్యటించి ధర్నాలు రాస్తారోకోలు నిరుద్యోగ ధూంధాం లాంటి తదుపరి కార్యాచరణ జూన్ 3 రోజున ప్రకటిస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్వి రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనువాసుయాదవ్, నిరుద్యోగ జేఏసీ నాయకులు కిరణ్ రాథోడ్, కయ్య వెంకటేష్, కుమార్ రాథోడ్, హరీష్, ధర్మరపు పవన్ కుమార్, కాశీనాథ్, మోహన్ తదితరులు పాల్గొన్నారు.