దళిత యువ రత్న అవార్డు అందుకున్న గుండె ఉదయ్ 

విశ్వంభర, హుస్నాబాద్: సామాజిక న్యాయం, బహుజన హక్కులు, బాబాసాహెబ్ డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఆశయాల సాధన కోసం నిరంతరం పోరాటం చేస్తూ ప్రజా సేవలో ముందుండే బీఎస్పీ ధూల్మిట్ట మండల అధ్యక్షుడు గుండె ఉదయ్‌ను తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మక “దళిత యువ రత్న” అవార్డుతో ఘనంగా సత్కరించింది. హైదరాబాద్‌లోని బేగంపేట్ టూరిస్ట్ ప్లాజాలో బుధవారం నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో గుండె ఉదయ్ కి అవార్డును తెలంగాణ రాష్ట్ర మహానీయుల ఉత్సవాల కమిటీ చైర్మన్ డా. అల్లిబిల్లి మహేందర్  అందించారు. సమాజంలో వెనుకబడిన వర్గాల హక్కుల కోసం ఆయన చేస్తున్న కృషి, యువతలో చైతన్యం కల్పించే కార్యక్రమాలు, బహుజన భావజాల ప్రచారం, ప్రజా సమస్యలపై నిరంతర పోరాటాన్ని గుర్తిస్తూ ఈ పురస్కారం ప్రదానం చేశారు. గ్రామీణ స్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉంటూ, సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించడం, అంబేద్కర్ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం, బహుజన నాయకుడు కాన్షీరామ్ మిషన్ లో కార్యకర్తగా యువతను సామాజిక ఉద్యమాల వైపు మళ్లించడం వంటి అంశాల్లో గుండె ఉదయ్ ప్రత్యేక గుర్తింపు పొందారు. ఈ సందర్భంగా గుండె ఉదయ్ మాట్లాడుతూ, ఈ అవార్డు నా వ్యక్తిగత గౌరవం మాత్రమే కాదు, బాబాసాహెబ్ ఆశయాల కోసం పోరాడుతున్న ప్రతి బహుజన కార్యకర్తకు దక్కిన గౌరవం. సమాజంలో అణగారిన వర్గాలకు న్యాయం జరిగే వరకు నా పోరాటం కొనసాగుతుంది అని అన్నారు.

🕒 21 May 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/heart-uday-who-received-the-dalit-yuva-ratna-award/article-15578

Tags: