మృతుడి కుటుంబానికి ఆర్ధిక సహాయం
విశ్వంభర, రామన్నపేట: యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మండలం, వెల్లంకి గ్రామానికి చెందిన రవ్వ శ్రవణ్ కుమార్ అనారోగ్యంతో ఈ నెల 18న మృతిచెందాడు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఆ కుటుంబానికి మాజీ సర్పంచ్, జిల్లా బిఆర్ఎస్ నాయకులు ఎడ్ల మహేందర్ రెడ్డి 5,000 రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. అలాగే ఆ కుటుంబానికి భవిష్యత్తులో తన వంతు సహకారం అందిస్తానని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్ష, కార్యదర్శులు పున్న వెంకటేశం, పిట్ట మహేందర్ రెడ్డి, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.