కృష్ణ ప్రసాద్ మృతి ప్రగతిశీల ఉద్యమాలకు తీరని లోటు
విశ్వంభర, హైదరాబాదు : మాజీ ఏఐఎస్ఎఫ్ , ఏఐవైఎఫ్ నాయకుడు, ఇండియన్ నేషనలిస్ట్స్ మూవ్‌మెంట్ జాతీయ కన్వీనర్ కృష్ణ ప్రసాద్ మంగళవారం తెల్లవారుజామున హైదరాబాదులో ఆకస్మికంగా మరణించారు. ఈయన మరణం ప్రగతిశీల ఉద్యమాలకు తీరని లోటుగా మారిందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, శాసనసభ్యుడు కూనంనేని సాంబశివరావు, నారాయణ, సిపిఐ తెలంగాణ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఈటీ నరసింహ తెలిపారు. కృష్ణ ప్రసాద్ మరణంపై సాంబశివరావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ప్రజా ఉద్యమాలకు అంకితభావంతో సేవలందించిన నాయకుడిని కోల్పోవడం బాధాకరమని పేర్కొన్నారు.ఈ సందర్భంగా ఈటీ నరసింహ మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచే ఉద్యమాలలో చురుకుగా పాల్గొని నగరంలో స్టూడెంట్ ఫెడరేషన్ బలోపేతానికి కీలక పాత్ర పోషించారని చెప్పారు. ఉర్దూ, ఇంగ్లీష్, హిందీ భాషల్లో ప్రావీణ్యం కలిగి అనర్గళంగా ఉపన్యాసాలు ఇవ్వగలిగిన వక్తగా గుర్తింపు పొందారని తెలిపారు. మేధావిగా, శాస్త్రవేత్తగా పరిశోధనలు చేస్తూనే సమాజంలో అసమానతలు, వివక్షలపై పోరాటం కొనసాగించారని పేర్కొన్నారు. అణగారిన వర్గాల హక్కుల కోసం కమ్యూనిస్టు ఉద్యమంలో చురుకుగా పాల్గొని ప్రజాస్వామ్య విలువల పరిరక్షణకు కృషి చేశారని తెలిపారు. దేశంలో లౌకిక ప్రజాస్వామ్య భావజాలాన్ని బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషించారని, తెలంగాణలో ప్రజాస్వామ్య వేదిక ఏర్పాటుకు మేధావులను ఏకం చేయడంలో ముందుండారని వివరించారు. అభ్యుదయ భావజాలంతో వ్యక్తులను ఐక్యం చేసి ప్రజా ఉద్యమాలను బలోపేతం చేయడంలో విశేష కృషి చేశారని అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజా ఉద్యమాలకు అంకితమైన నాయకుడి మరణం తీవ్ర విషాదమని, ఆయన ఆలోచనలను ముందుకు తీసుకెళ్లడమే నిజమైన నివాళి అవుతుందని తెలిపారు.