ధాన్యం అన్‌లోడింగ్‌లో నిర్లక్ష్యం..
- కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకోవాలి..
- భారతీయ కిసాన్ సంఘ్ హుస్నాబాద్ డివిజన్ ఇంచార్జ్ : కవ్వ వేణుగోపాల్ రెడ్డి
విశ్వంభర, హుస్నాబాద్ : హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డులో ఐకెపి, సొసైటీ కేంద్రాల నుండి వచ్చిన ట్రాక్టర్లలో ధాన్యాన్ని అన్‌లోడ్ చేయడంలో తీవ్ర నిర్లక్ష్యం జరుగుతోందని, రైతులు, ట్రాక్టర్ యజమానులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని భారతీయ కిసాన్ సంఘ్ డివిజన్ ఇంచార్జ్ కవ్వ వేణుగోపాల్ రెడ్డి ఆరోపించారు. అక్కన్నపేట మండలం నుండి ట్రాక్టర్లు ఐకెపి, సొసైటీ కేంద్రాల ద్వారా నాలుగు రోజులుగా హుస్నాబాద్ మార్కెట్ యార్డ్ గోదాములకు చేరుకున్నప్పటికీ, హమాలీ కాంట్రాక్టర్ కేవలం 15 మంది కార్మికులతో మాత్రమే అన్‌లోడింగ్ పనులు నిర్వహించడం వల్ల వాహనాలు రోజుల తరబడి నిలిచిపోతున్నాయని తెలిపారు. దీంతో ట్రాక్టర్ యజమానులు, డ్రైవర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, మార్కెట్ యార్డులో భద్రత లేకపోవడంతో వాహనాల నుండి జాకీలు, కవర్లు దొంగతనానికి గురవుతున్నాయని ఆరోపించారు. ఎక్కువ సమయం బరువుతో నిలిచిపోవడం వల్ల టైర్లు దెబ్బతినడం, ఇంజిన్లపై ప్రభావం పడే పరిస్థితి ఏర్పడుతోందని ట్రాక్టర్ డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని,ధాన్యాన్ని వెంటనే దించాలని ట్రాక్టర్ డ్రైవర్లు ఆందోళన చేపట్టగా, పోలీసులు వారిని శాంతింపజేశారని, స్థానిక రెవెన్యూ అధికారులు మాత్రం తూతూమంత్రంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.హమాలీ కాంట్రాక్టర్ “ఇష్టముంటే హమాలీలను ఉంచుతాం, లేకుంటే తీసుకెళ్తాం” అంటూ నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నారని, దీనిపై రెవెన్యూ శాఖ పూర్తిగా చేతులెత్తేసిందని అన్నారు. ఈ విషయాలను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లినా స్పందన లేకపోవడం రైతుల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని పేర్కొన్నారు. అలాగే చుట్టుపక్కల గ్రామాల్లో ధాన్యం కొనుగోళ్లు వేగంగా నిర్వహించడంలో ఐకెపి, సొసైటీ అధికారులు విఫలమయ్యారని, లారీలు, ట్రాక్టర్లు సమయానికి పంపడంలో డిఆర్డిఏ అధికారులు పూర్తిగా విఫలమయ్యారని ఆరోపించారు. రైతులపై నిజమైన చిత్తశుద్ధి ఉంటే వెంటనే జిల్ల అధికారులపై రాష్ట్ర మంత్రి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే హుస్నాబాద్ మార్కెట్ యార్డులో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకుని, మూడు నాలుగు రోజులుగా నిలిచిపోయిన వాహనాల్లోని ధాన్యాన్ని వెంటనే అన్‌లోడ్ చేయించాలని కోరారు. సమస్యను పరిష్కరించకపోతే భారతీయ కిసాన్ సంఘ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.