మైనింగ్ పనులను తక్షణమే నిలిపివేయాలి
- ఉపాధి హామీ కూలీల డిమాండ్
విశ్వంభర, జనగాం: దేవరుప్పుల మండలం ఉమ్మడి కడవెండి గ్రామ ప్రాంతంలో ఎంతో ప్రసిద్ధి గాంచిన, చుట్టుపక్కల గ్రామాల మండలాల ప్రజల ఆరాధ్య దైవం గా కొలువైన ఆధ్యాత్మికమైన శ్రీ వాన కొండయ్య లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం తరతరాలుగా స్థానిక ప్రజల నమ్మకానికి, సంస్కృతికి ఈ గుట్ట ఒక నిలువుటద్దం. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ప్రస్తుతం ఈ పవిత్రమైన గుట్టపై జరుగుతున్న మైనింగ్ (క్వారీ) పనులు స్థానిక ప్రజలను, భక్తులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి.ఈ నేపథ్యంలో జిల్లా నాయకులు పల్లా సుందర్ రామిరెడ్డి ఆధ్వర్యంలో ,గ్రామంలోని ఉపాధి హామీ పనుల దగ్గర ఉన్న వందలాది మంది కూలీలను కలిసి, ఈ మైనింగ్ అంశంపై వారి అభిప్రాయాలను సేకరించడం జరిగింది. ఈ సందర్భంగా కూలీలు తమ ఆవేదనను, అభ్యంతరాలను వ్యక్తం చేశారు. వాన కొండయ్య లక్ష్మీనరసింహస్వామి మా ఇలవేల్పు. స్వామివారు కొలువైన గుట్టను మైనింగ్ పేరుతో తవ్వేస్తుంటే మా మనోభావాలు దెబ్బతింటున్నాయి. లాభాల కోసం దేవుడి గుట్టను సైతం ధ్వంసం చేయడం సరికాదు. మైనింగ్ నుండి వచ్చే దుమ్ము, ధూళి కారణంగా చుట్టుపక్కల ప్రాంత వాతావరణం కలుషితమైన. దీనివల్ల పక్కనే ఉన్న పొలాల్లో పంటలు దెబ్బతినే ప్రమాదం ఉంది. గుట్టపై మైనింగ్ కోసం జరిపే భారీ పేలుళ్ల శబ్దాలకు భవిష్యత్తులో గుట్టపై ఉన్న పురాతన ఆలయ నిర్మాణానికి కూడా ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని కూలీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మా వాన కొండయ్య గుట్ట కేవలం ఒక రాయి, రప్ప కాదు, అది మా ప్రాంత సంస్కృతి, నమ్మకం. మా ప్రాణాలైనా ఇస్తాం కానీ,దేవుడి గుట్టను మైనింగ్ మాఫియా పాలు కానివ్వం అని ఉపాధి హామీ కూలీలు , బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు తీగల దయాకర్ మాజీ మండల అధ్యక్షుడు బస్వ మల్లేష్ మాజీ ఎంపీపీ కొల్లూరు సోమయ్య,ఏల సోమ సుందర్ గ్రామ సర్పంచ్ భాషిపాక రాములు గ్రామ శాఖ అధ్యక్షుడు తాటిపల్లి మహేష్ ,బీఆర్ఎస్ పార్టీ గ్రామ మండల నాయకులు సుడిగాల హనుమంతు నక్క రమేష్ , సోమ నర్సయ్య,రాజు,మండల సీనీయర్ నాయకులు,యువజన నాయకులు, గ్రామ పెద్దలు చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించి ఈ మైనింగ్ అనుమతులను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.