పక్కా ఓటర్ల జాబితా తయారే లక్ష్యం

పక్కా ఓటర్ల జాబితా తయారే లక్ష్యం

  •  రాజకీయ పార్టీల సమావేశంలో జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ 

విశ్వంభర, సూర్యాపేట: ఎలాంటి తప్పులు లేని, అత్యంత పారదర్శకమైన పక్కా ఓటర్ల జాబితాను రూపొందించడమే జిల్లా యంత్రాంగం,  రాజకీయ పార్టీల ముఖ్య లక్ష్యం కావాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ పిలుపునిచ్చారు. ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణపై జిల్లా స్థాయి రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలెక్టరేట్ వీసీ సమావేశ మందిరంలో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, భారత ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం జిల్లా యంత్రాంగం అత్యంత పారదర్శకంగా, ఖచ్చితమైన విచారణతో బాధ్యతాయుతంగా పనిచేస్తుందని స్పష్టం చేశారు. రాజకీయ నాయకులు సైతం క్షేత్రస్థాయిలో పర్యటించి పరిశీలన చేయాలని కలెక్టర్ సూచించారు. ఇందుకోసం ప్రతి రాజకీయ పార్టీ తక్షణమే తమ బూత్ స్థాయి ఏజెంట్లను  నియమించుకోవాలని కోరారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించి, ప్రజాస్వామ్య బలోపేతంలో భాగస్వాములు కావాలని, అధికారులతో రాజకీయ నాయకులు నిరంతరం సమన్వయం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమం జూన్ 15నుండి ప్రారంభం అవుతుందని, జూన్ 15 నుండి 24 వరకు బూత్ స్థాయి అధికారులకు పూర్తిస్థాయి శిక్షణ, ప్రిపరేషన్, ప్రింటింగ్ జూన్ 25 నుండి జూలై 24వ తేదీ వరకు బిఎల్ఓలచే ఇంటింటికీ వెళ్లి సమగ్ర విచారణ, జులై, 24 న పోలింగ్ కేంద్రాలను ఓటర్ల సంఖ్యకు అనుగుణంగా పునర్వశీకరించటం, జూలై 31న ఓటర్ల ముసాయిదా (డ్రాఫ్ట్) జాబితా ప్రచురణ, జూలై 31 నుండి ఆగస్టు 30వ తేదీ వరకు ముసాయిదాపై అభ్యంతరాలు, క్లెయిమ్‌ల స్వీకరణ, జులై, 31 నుండి సెప్టెంబర్, 28 వరకు అభ్యంతరములు, అభ్యంతరముల పరిష్కారం, అక్టోబర్ 1న ఓటర్ల తుది జాబితా అధికారిక ప్రచురణ చేయడం జరుగుతుందని వివరించారు. కొత్త ఓటర్ల నమోదు, జాబితా ప్రక్షాళనలో బూత్ స్థాయి అధికారుల పాత్ర అత్యంత కీలకమని కలెక్టర్ పేర్కొన్నారు. బీఎల్ఓలు ప్రతి ఇంటికీ వెళ్లి క్షుణ్ణంగా విచారణ చేసిన అనంతరం మాత్రమే కొత్త ఓటరు నమోదు ప్రక్రియ చేపడతారని, స్థానికంగా చనిపోయిన వారి పేర్లను తొలగించడం, వలస వెళ్లిన వారిని గుర్తించడంతో పాటు అర్హులైన కొత్త ఓటరు ఎవరూ కూడా జాబితాలో చేర్చే బాధ్యత బీఎల్ఓలపై ఉందని కలెక్టర్ స్పష్టం చేశారు. కొత్తగా ఏర్పాటు చేసే పోలింగ్ కేంద్రాల నియమ నిబంధనలపై కలెక్టర్ స్పష్టతనిచ్చారు. ప్రతి కొత్త పోలింగ్ కేంద్రంలో గరిష్టంగా 1200 మంది ఓటర్లు మాత్రమే ఉండాలని, ఓటరు తన ఓటు హక్కును వినియోగించు కోవడానికి 2 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం ప్రయాణించకుండా ఉండేలా వీలైనంత సమీపంలోనే కేంద్రాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. 1-10-2026 నాటికి 18 సంవత్సరాల వయస్సు నిండే ప్రతి యువతీ యువకుడు తప్పనిసరిగా ఫామ్-6 ద్వారా కొత్త ఓటరుగా పేరు నమోదు చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. అలాగే ఓటర్ల జాబితాలో తప్పుల సవరణలు, మార్పులు, చేర్పుల కోసం ఫామ్-8 ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ఒక దృఢమైన ప్రజాస్వామ్య నిర్మాణానికి ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఓటు నమోదు ప్రక్రియలో సహకరించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ బి హరి సింగ్, రాజకీయ పార్టీల నుండి  చెక్కిలం రాజేశ్వర రావు, ఎం డి అజిద్ , వి రవి , కె కరుణాకర్  ఎలక్షన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

🕒 21 May 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/the-objective-is-to-prepare-a-complete-voter-list/article-15582

Tags: