జనగణన పై చిన్ననాగారంలో కళాప్రదర్శన
విశ్వంభర, ఇనుగుర్తి: భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జనాభా గణన పై జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్ ఆదేశానుసారం డిపిఆర్ఓ రాజేంద్ర కుమార్ ఆధ్వర్యంలో తెలంగాణ సాంస్కృతిక సారథి మునికుంట్ల ఐలేష్ కుమార్ కళాబృందంచే ఇనుగుర్తి మండలంలోని చిన్ననాగారంలో బుధవారం కళారూప ప్రదర్శనతో విస్తృత ప్రచారం కల్పించారు. సమగ్ర ఖచ్చితమైన గణాంకాల రూపకల్పనలో జనగణన కీలకమని,జనాభా గణన, గృహ జాబితా కార్యక్రమానికి ప్రజలు పూర్తి సహకారం అందించాలని కోరుతూ కళాకారులు పాటల రూపంలో ప్రజలకు అవగాహన కల్పించిన తీరు అలరించింది. కార్యక్రమంలో స్థానిక సర్పంచి చెడుపాక సుజాత యాకయ్య, కళాకారులు కంబాలపల్లి సత్యనారాయణ,మెరుగు రవీందర్ గౌడ్,బక్కి యాదయ్య,దేశెట్టి ప్రవీణ్ కుమార్, వజ్జ రాజ్యలక్ష్మి,రోజ,కొదుమూరి కీర్తి దర్శనం యుగంధర్, సాసు పరమేష్,ఆరేపల్లి నరేష్,బిక్షపతి గ్రామస్తులు పాల్గొన్నారు.