ఆరేపల్లి లో బీసీ భవన్ , స్టడీ సర్కిల్ నిర్మించాలి

  • హుస్నాబాద్ నియోజకవర్గ బీఎస్పీ పార్టీ ఇంచార్జ్ :  పచ్చిమట్ల రవీందర్ గౌడ్

విశ్వంభర, హుస్నాబాద్ : హుస్నాబాద్ పట్టణంలోని ఆరేపల్లి ప్రాంతంలో బీసీ భవన్, బీసీ స్టడీ సర్కిల్, బీసీ ఫంక్షన్ హాల్ నిర్మాణానికి రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ ఐదు కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయాలని బీఎస్పీ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ పచ్చిమట్ల రవీందర్ గౌడ్ డిమాండ్ చేశారు. బీఎస్పీ పార్టీ, బీసీ సంఘాల తరఫున మంత్రికి విజ్ఞప్తి చేస్తున్నట్లు తెలిపారు.హుస్నాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని ఆరేపల్లి వద్ద పల్లె ప్రకృతి వనం సమీపంలో ఉన్న రెండు ఎకరాల అసైన్డ్ భూమిలో గత బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే బీసీ స్టడీ సర్కిల్ ఏర్పాటు చేయాలని మాజీ ఎమ్మెల్యే సతీష్ బాబు, ప్రస్తుత మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ దృష్టికి తీసుకెళ్లినట్లు పేర్కొన్నారు. ఈ ప్రాంతంలో బీసీ స్టడీ సర్కిల్ ఏర్పాటు చేస్తే నిరుద్యోగ యువత వివిధ పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేందుకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు.హుస్నాబాద్ ప్రాంతానికి చెందిన బీసీ విద్యార్థులు సరైన కోచింగ్ సదుపాయాలు లేక కరీంనగర్, హనుమకొండ, హైదరాబాద్ వంటి దూర ప్రాంతాలకు వెళ్లి లక్షల రూపాయలు ఖర్చు చేస్తూ ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. స్థానికంగా స్టడీ సర్కిల్ ఏర్పాటు చేస్తే పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఉపశమనం కలుగుతుందని తెలిపారు.అదేవిధంగా బీసీ భవన్ లేకపోవడం వల్ల సమావేశాలు, సామాజిక కార్యక్రమాలు నిర్వహించేందుకు బీసీ సంఘాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని చెప్పారు. పేద, మధ్యతరగతి కుటుంబాలు ఫంక్షన్ హాల్ లేక పెళ్లిళ్లు నిర్వహించేందుకు అధిక మొత్తంలో డబ్బులు ఖర్చు చేయాల్సివస్తోందన్నారు.ఆరేపల్లి ప్రాంతంలో పరిశ్రమలు లేక అభివృద్ధి వెనుకబడిపోయిందని, కనీసం బీసీ భవన్, బీసీ స్టడీ సర్కిల్ ఏర్పాటు చేసి ఆ ప్రాంత అభివృద్ధికి మంత్రి ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. అలాగే స్థానిక గ్రంథాలయానికి కూడా నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బీసీ నాయకులు గంగుల రమేష్, కాసబోయిన సాయిలు, చెన్నబోయిన కొమురయ్య తదితరులు పాల్గొన్నారు.

🕒 21 May 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/bc-bhavan-study-circle-should-be-constructed-in-arepally/article-15558

Tags: