నియామక పత్రం అందజేసిన డీసీసీ అధ్యక్షుడు బీర్ల ఐలయ్య

  • గుండాల మండల కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఇమ్మడి దశరథ 

విశ్వంభర,  గుండాల: గుండాల మండలం తురకల షాపురం గ్రామానికి చెందిన యువ కాంగ్రెస్ నాయకుడు ఇమ్మడి దశరథకు గుండాల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి వరించింది. పార్టీ పట్ల ఆయన చూపుతున్న అంకితభావం, క్రమశిక్షణ, సేవా తత్వాన్ని గుర్తించిన పార్టీ అధిష్ఠానం ఈ బాధ్యతను అప్పగించింది. బుధవారం  వివేరా హోటల్‌లో నిర్వహించిన జిల్లా స్థాయి సమావేశంలో ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే, డీసీసీ అధ్యక్షుడు బీర్ల ఐలయ్య చేతుల మీదుగా ఇమ్మడి దశరథకు నియామక పత్రం అందజేశారు. ఈ సందర్భంగా బీర్ల ఐలయ్య మాట్లాడుతూ, పార్టీ బలోపేతానికి గ్రామ స్థాయి నుంచి కృషి చేస్తున్న దశరథ నాయకత్వంలో గుండాల మండలంలో కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. నియామకంతో ఆనందం వ్యక్తం చేసిన ఇమ్మడి దశరథ, తనపై నమ్మకం ఉంచిన పార్టీ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూ, మండలంలో కాంగ్రెస్ పార్టీని మరింత శక్తివంతం చేయడానికి కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు, మాజీ డీసీసీ అధ్యక్షుడు అండెం సంజీవరెడ్డి, జనగామ ఉపేందర్ రెడ్డి, మోత్కూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ నూనెముంతల విమల వెంకటేశ్వర్లు, ఆలేరు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఈరాసరపు యాదగిరి, జిల్లా ఉపాధ్యక్షుడు ఏలూరి రామ్ రెడ్డి, రాష్ట్ర హజ్ కమిటీ సభ్యుడు ఎం.డి. షర్ఫుద్దీన్, కెమిడి ఉపేందర్, దొడ్డబోయిన నరేష్, మండల నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. గుండాల మండల కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఇమ్మడి దశరథ నియామకంపై పార్టీ శ్రేణులు, అభిమానులు హర్షం వ్యక్తం చేస్తూ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.

🕒 21 May 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/dcc-president-birla-ailaiah-handed-over-the-appointment-letter/article-15532

Tags: