నెల్లికుదురులో 2.4 కిలోల గంజాయి పట్టివేత
- ఇద్దరు పరారీ, ముగ్గురిపై కేసు నమోదు..
సీఐ సత్యనారాయణ
విశ్వంభర, నెల్లికుదురు: చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న అక్రమార్కులను నెల్లికుదురు పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. నాకా బంది(వాహన తనిఖీ)లో గంజాయితో సహా నిందితులు పోలీసులకు చిక్కిన ఘటన మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలంలో చోటుచేసుకుంది. ఈ మేరకు కేసముద్రం సీఐ సత్యనారాయణ, నెల్లికుదురు ఎస్సై చిర్ర రమేష్ బాబు తో కలిసి స్థానిక పోలీస్ స్టేషన్లో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో నిందితుల అరెస్టు చూపించి సంబంధిత వివరాలను వెల్లడించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చి హైదరాబాదులో ఉంటున్న ఏదుల రాజకుమార్ ,మాలేగోని ఆంజనేయులు అలియాస్ రామ్ చందర్, రామ్ గోని రాజేష్, రాజ్ అలియాస్ ఎఫ్ జెడ్ ఈ నలుగుకి గంజాయి తాగే అలవాటు ఉంది. గంజాయి తాగడానికి డబ్బుల తో పాటు, తక్కువ సమయంలో ఎక్కువ సంపాదించాలనే దురాలోచనతో గంజాయిని కొని హైదరాబాదు ప్రాంతంలో విక్రయిస్తున్నారు. ఈ క్రమంలో గంజాయి కోసం భద్రాచలం వెళ్లి ఆరా తీస్తుండగా రాజేష్ గంజాయి విక్రయిస్తాడని తెలుసుకొని ఆయన దగ్గర ఎండు గంజాయి 2.4కి.లు తక్కువ ధరకు కొన్నారు. దీని విలువ రూ.1,19,750. దీనిని కారులో హైదరాబాదుకు తీసుకు వెళ్తున్న క్రమంలో జిల్లా ఎస్పీ శబరిష్ ఆదేశాల మేరకు నాకాబంది నిర్వహిస్తున్న క్రమంలో మంగళవారం రాత్రి పార్వతమ్మ గూడెం స్టేజి సమీపం ఎం కె ఆర్ గార్డెన్ వద్ద సంబంధిత కారును ఆపి తనిఖీ చేయగా గంజాయి లభించింది. దీంతో గంజాయిని, కారును స్వాధీనం చేసుకుని సీజ్ చేసి సంబంధిత వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు సిఐ సత్యనారాయణ తెలిపారు.రాజ్,రాజేష్ లు పరారి లో ఉన్నారని త్వరలోనే పట్టుకుంటామని సీఐ చెప్పారు. యువత గంజాయి డ్రగ్స్ వంటి మారకద్రవ్యాల జోలికి వెళ్లి జీవితాలను పాడు చేసుకోవద్దన్నారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ హెచ్చరించారు. గంజాయిని చాకచక్యంగా పట్టుకున్నందుకు సీఐ సత్యనారాయణ, ఎస్సై చిర్ర రమేష్ బాబు, సంబంధిత పోలీస్ సిబ్బందిని మహబూబాబాద్ ఎస్.పి డా. శబరీష్, డీఎస్పీ ఎన్.తిరుపతిరావు అభినందించినట్లు సిఐ తెలిపారు.