ఇనుగుర్తిలో సంబురంగా ఇందిరమ్మ గృహప్రవేశం
విశ్వంభర, ఇనుగుర్తి: పేదలకు పక్కా ఇల్లు నిర్మించాలనే సంకల్పంతో సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఇందిరమ్మ ఇండ్లు పథకం ప్రవేశపెట్టి మొదటి విడత మంజూరు చేసింది. ఈ క్రమంలో ఇనుగుర్తి మండల కేంద్రానికి చెందిన ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారు వల్లముల స్పందన మురళి దంపతులు తమ ఇల్లు నిర్మాణం పూర్తి చేసుకొని సంబురంగా బుధవారం గృహప్రవేశం చేశారు. దీనికి కేసముద్రం మార్కెట్ చైర్మన్ గంట సంజీవరెడ్డి,స్థానిక ఎస్సైకరుణాకర్, సర్పంచి తమ్మడపల్లి కుమార్,ఆర్ ఐ బషీర్,వెటర్నరీ డా.రవీందర్ తదితరులు హాజరై లబ్ధిదారులతో కలిసి గృహప్రవేశ క్రతవు నిర్వహించారు.ఈ సందర్భంగా సంజీవరెడ్డి మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వంలో అర్హులకు గూడు అందించడానికి ఇందిరమ్మ ఇండ్ల పథకం,కూడు అందించడానికి రేషన్ కార్డులు,సన్నబియ్యం,ఇంటికి వెలుగులు ఇవ్వడానికి ఉచిత కరెంట్, మహిళల ప్రయాణానికి ఫ్రీ బస్సు, రైతులకు భరోసా, భీమా,పంటలకు మద్దతు ధర, సబ్సిడీ వ్యవసాయ పరికరాలు వంటి ఎన్నో పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు. ఇల్లు వేగంగా పూర్తి చేసి గృహప్రవేశం చేయడం పట్ల లబ్ధిదారులను అభినందించారు. కార్యక్రమంలో దిశ సభ్యులు గుజ్జునూరి బాబురావు,వార్డు సభ్యులు నద్దునూరి ప్రశాంత్,వేముల శ్రీను,గుజ్జునూరి శ్రీకాంత్,గోపందాస్ కృష్ణ,ఏఎంసి డైరెక్టర్ కొట్టం రాము,కాంగ్రెస్ మండల, గ్రామ అధ్యక్షులు సతీష్,రాజేందర్ రెడ్డి,జిల్లా నేత కట్టయ్య యాదవ్,సలీం రామ్,తదితరులు పాల్గొన్నారు.



