పెరేడ్ గ్రౌండ్ సభకు విస్తృత సన్నాహాలు
- ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి
విశ్వంభర, చేవెళ్ల: ఈ నెల 10వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొననున్న పెరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించనున్న భారీ బహిరంగ సభను విజయవంతం చేయడానికి బీజేపీ నాయకులు విస్తృతంగా సన్నాహాలు చేస్తున్నారు. సభకు పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చేలా పిలుపునిస్తూ, గోడలపై వాల్ పెయింటింగ్ కార్యక్రమాన్ని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశ అభివృద్ధి దిశగా ప్రధాని మోదీ చేపట్టిన కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం ప్రతి కార్యకర్త బాధ్యత అని తెలిపారు. ఈ సభ ద్వారా ప్రజలకు కేంద్ర ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలపై అవగాహన కల్పించనున్నామని పేర్కొన్నారు. సభను విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో చేవెళ్ల నియోజకవర్గo యువ నాయకులు డాక్టర్ వైభవ్ రెడ్డి, చేవెళ్ల మున్సిపల్ అధ్యక్షులు అత్తిలి అనంతరెడ్డి, సామ మాణిక్య రెడ్డి, బీజేపీ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.



