జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలి

జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలి

విశ్వంభర, హైదరాబాదు : తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు మామిడి సోమయ్య రాష్ట్ర సమాచార పౌరసంబంధాల శాఖ స్పెషల్ కమీషనర్ ముకుందరెడ్డి ని కలిసి వర్కింగ్ జర్నలిస్టుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరారు. గురువారం హైదరాబాదులో జరిగిన ఈ భేటీలో మీడియా డైరీను అందజేశారు. ప్రధానంగా అక్రెడిటేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. జర్నలిస్టులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలపై చర్చించి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఫెడరేషన్ రాష్ట్ర కో-కన్వీనర్ తన్నీరు శ్రీనివాస్, సీనియర్ నాయకుడు పద్మనాభ రావు తదితరులు పాల్గొన్నారు.

🕒 08 May 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/the-problems-of-journalists-should-be-solved/article-15078

Tags: