జనగణనలో భాగస్వాములు కావాలి

జనగణనలో భాగస్వాములు కావాలి

విశ్వంభర, సిద్దిపేట:-సమగ్ర, కచ్చితమైన గణాంకాల రూపకల్పనలో జనగణన కీలకమని, దేశవ్యాప్తంగా నిర్వహించే జనగణన ప్రక్రియలో అందరూ భాగస్వాములు కావాలని కలెక్టర్ హైమావతి పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల నుంచి మాడ్రన్ బస్టాండ్ వరకు ఆదివారం నిర్వహించిన మొదటిదశ జనగణన అవగాహన ర్యాలీకి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. 2021లో జరగాల్సిన జనగణన కోవిడ్ కారణంగా జరగలేదన్నారు. ఇది 16వ జనగణన అని, తెలంగాణలో మొదటిదని చెప్పారు. మొదటి సారి డిజిటల్ విధానంలో జనగణన నిర్వహిస్తున్నట్టు తెలిపారు. కుటుంబ వివరాలను స్వయంగా మీరే నమోదు చేసుకునే అవకాశం స్వీయగణన ద్వారా కల్పించారని చెప్పారు. సోమవారం నుంచి జనగణన ఎన్యూమరేటర్లు ఇంటింటికీ తిరిగి వివరాలను సేకరిస్తారన్నారు. అనుభవజ్ఞులైన సిబ్బందిని జనగణన సూపర్ వైజర్లు, ఎన్యూమరేటర్లుగా నియమించి వారికి శిక్షణ అందించినట్టు వెల్లడించారు. ప్రత్యేక ఐడీ కార్డులు కూడా జారీ చేశామని, ఇంటికొచ్చినప్పుడు వారికి సహకరించాలని కోరారు.  జనగణన పేరుతో అనుమానిత వ్యక్తులు ఇంటికొచ్చి వివరాలు అడిగే అవకాశం ఉంటుందని, అలాంటి వ్యక్తుల పట్ల జాగ్రత్తగా వ్యవహరించాలన్నారు. జనగణనలో పాల్గొనే సిబ్బంది గుర్తింపు కార్డులపై క్యూఆర్ కోడ్ ఉంటుందని, దానిని స్కాన్ చేస్తే అధికారిక వివరాలు వస్తాయని, ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని విజ్ఞప్తి చేశారు.  కార్యక్రమంలో డీఈవో శ్రీనివాస్ రెడ్డి, డీఎస్సీడీవో హవీద్, సెక్యూరిటీ అధికారి రామస్వామి, ఎంఈఓలు, ఎన్యూమరేటర్లు, పలు సంఘాల ప్రతినిధులు, తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులు, విద్యార్థులు పాల్గొన్నారు.

🕒 11 May 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/need-to-participate-in-the-census/article-15268

Tags: