భక్తిశ్రద్ధలతో సవార్లకు గ్రామస్తుల మొక్కులు
విశ్వంభర, మహబూబాబాద్ : మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని 6వ వార్డు బేతోలు గ్రామంలో బుధవారం సవార్లకు ప్రార్ధనలు చేసి సాంప్రదాయకంగా మొక్కులు చెల్లించుకున్నారు . పీరీల గుండం వద్ద భక్తులు చేసిన పాల మటికిలతో ఫాతిహాలు నిర్వహించి పానకం పంపిణీ చేశారు . ఈ సందర్భంగా పలువురు ముస్లిం భక్తులు మాట్లాడుతూ , మతసామరస్యానికి ప్రతీక హిందూ , ముస్లింలు సోదర భావంతో మొహరం వేడుకలు గ్రామంలో అత్యంత వైభవంగా (పీర్ల పండుగ) భక్తిశ్రద్ధలతో కలిసి మెలిసి జరుపుకుంటారు అని , హసేన్ ,హుస్సేన్ పగటి సవార్లు కొలువుదీరగా హిందూ, ముస్లిం భక్తులు పెద్ద ఎత్తున సవార్లకు ప్రార్ధనలు ఊదు రంగుల దట్టీలు కుడకలు బెల్లం తయారు చేసిన బాసింగాలు, కందుర్లు చేసి సాంప్రదాయకంగా మొక్కులు చెల్లించుకున్నామని చెప్పారు. ముస్లిం మత పెద్దలతో కలిసి వివిధ కూడళ్లలో డప్పు చప్పుళ్ల మధ్య పీరిల ఊరేగింపు నిర్వహించినారు . ఈ కార్యక్రమంలో మత పెద్దలు, ముజావర్లు, భక్తులు, మొహరం కమిటీ, బాధ్యులు షేక్ యూసుఫ్, షేక్ మస్తాన్, షేక్ ఖాదర్ బాబా, షేక్ షరీఫ్, షేక్ షబ్బీర్, షేక్ ఫకీర్, షేక్ లతీఫ్, షేక్ జావిద్, షేక్ బాల్ సైద్, షేక్ యాకుబ్ పాషా, షేక్ ఖాజా, షేక్ పాషా, షేక్ ఇమ్రాన్, పాల్గొన్నారు .