మిర్యాలగూడకు హైడ్రాను తీసుకురావాలి: సీపీఐ
విశ్వంభర, మిర్యాలగూడ: మిర్యాలగూడ నియోజకవర్గ పరిధిలోని చెరువుల ఆక్రమణలను తొలగించేందుకు హైడ్రా వ్యవస్థను తీసుకురావాలని సీపీఐ నాయకులు ఆర్డీవోకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు బంటు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, మిర్యాలగూడ సమీపంలోని యాదగిరిపల్లి–పందిర్లపల్లి చెరువు గతంలో సుమారు 750 ఎకరాల విస్తీర్ణం కలిగి ఉండగా, ప్రస్తుతం ఆక్రమణల కారణంగా క్రమంగా కుంచించుకుపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. చెరువు హద్దులను గుర్తించి ఏర్పాటు చేసిన స్తంభాలను తొలగించి పలువురు ఆక్రమణలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. చెరువుల పరిరక్షణ కోసం హైడ్రా ద్వారా ప్రత్యేక చర్యలు చేపట్టి, ఆక్రమణలను తొలగించాలని కోరారు. అలాగే చెరువు చుట్టూ రింగ్ రోడ్డు, పార్కింగ్ సదుపాయాలు ఏర్పాటు చేసి మినీ ట్యాంక్‌బండ్‌గా అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు. గొలుసుకట్టు చెరువులను గుర్తించి వాటిని పరిరక్షించాలని, తద్వారా భూగర్భ జలాలు నిల్వ ఉండటంతో పాటు వ్యవసాయానికి ప్రయోజనం చేకూరుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో సీపీఐ మండల కార్యదర్శి ఏ. రామలింగం, రైతు సంఘం నాయకులు కనకయ్య, యాదగిరి, కృష్ణ, వెంకటయ్య, షమీం, మట్టయ్య, వసంతం తదితరులు పాల్గొన్నారు.