గ్రీన్ ఫీల్డ్ హైవే తో పొలాలకు దారి లేకుండా పోయింది

  1. - రోడ్డు నిర్మించాలని కోమటిపల్లి రైతుల డిమాండ్

విశ్వంభర,ఇనుగుర్తి: గ్రీన్ ఫీల్డ్ హైవే తో తమ పొలాలకు దారి లేకుండా పోయిందని ఇచ్చిన హామీ మేరకు రోడ్డు నిర్మించాలని ఇనుగుర్తి మండలం కోమటిపల్లి గ్రామానికి చెందిన రైతులు గ్రీన్ ఫీల్డ్ హైవే యాజమాన్యాన్ని డిమాండ్ చేసింది. ఈ మేరకు సంబంధిత హైవే రోడ్డు వద్ద పలువురు రైతులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా బాధిత రైతులు మాట్లాడుతూ గ్రీన్ ఫీల్డ్ హైవే, కోమటిపల్లి చెరువు మధ్యలో సుమారు యాభై మంది రైతులకు చెందిన పొలాలు ఉన్నాయని,సంబంధిత గ్రీన్ ఫీల్డ్ హైవే కాంట్రాక్టర్ చెరువు అలుగు నీళ్ళు వెళ్లేందుకు తూము ఏర్పాటు చేయడంతో సంబంధిత నీరు ఆ ప్రాంతంలో నిలిచిపోయి దారి లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులతో పాటు పొలాలకు ఎరువులు, వ్యవసాయ పనిముట్లు, కూలీలు వెళ్లాలంటే పడవలలో వెళ్లాల్సిన దుస్థితి నెలకొందని ఈ విషయం పలుమార్లు గ్రీన్ ఫీల్డ్ హైవే మేనేజ్మెంట్ దృష్టికి, జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకురావడంతో గ్రీన్ ఫీల్డ్ హైవే యాజమాన్యం గతంలో ఇక్కడ రోడ్డు వేసి రైతులకు ఇబ్బంది కలుగకుండా చేస్తామని హామీ ఇచ్చిందన్నారు. రోడ్డు నిర్మాణం పూర్తి కావస్తున్నా పొలాలకు మాత్రం రోడ్డు వేయలేదని, దీంతో యాజమాన్యం,అధికారుల వద్దకు పలుమార్లు తిరిగినా పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే రోడ్డు నిర్మించి రైతులను ఆదుకోవాలని అన్నారు. గ్రీన్ ఫీల్డ్ హైవే రోడ్డు నిర్మాణానికి కోమటిపల్లి గ్రామానికి జీవనాధారమైన చెరువు ఫెన్సింగ్ ను సంబంధిత యాజమాన్యం ధ్వంసం చేసి రోడ్డుకు మట్టి తరలించారు. ఆ సమయంలో ఫెన్సింగ్ యధావిధిగా నిర్మిస్తామని చెప్పి ఇప్పుడు పట్టించుకోవడం లేదని వెంటనే ఫెన్సింగ్ పునరుద్ధరించాలని మత్స్య సహకార సభ్యులు నీలం వెంకన్న,అల్లి లక్ష్మీనారాయణ సంబంధిత యాజమాన్యాన్ని కోరారు.కార్యక్రమంలో బాధిత రైతులు బల్లవరం కృష్ణామాచార్యులు,గోసుల ఎల్లయ్య, మామిళ్ల కొమురయ్య, గాడిపల్లి నారాయణ, అల్లి లక్ష్మినారాయణ, పొనుగోటి కొమ్మాలు తదితరులు పాల్గొన్నారు.

🕒 25 Jun 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/with-the-green-field-highway-the-fields-are-left-without/article-17139

Tags: