అభివృద్ధి పనులు వెంటనే పూర్తి చేయాలి 

అభివృద్ధి పనులు వెంటనే పూర్తి చేయాలి 

  • అభివృద్ధి పనులు వెంటనే పూర్తి చేయాలి 

విశ్వంభర, హుస్నాబాద్ : హుస్నాబాద్ నియోజకవర్గం లో పంచాయతీ రాజ్ శాఖల లో చేపడుతున్న ఏంజిఎన్ఆర్ఈజీఎస్ సీసీ రోడ్, బిటి రోడ్, హెల్త్ సబ్ సెంటర్, అంగన్వాడి టాయిలెట్స్, ప్రైమరీ హెల్త్ సెంటర్ రిపైర్, కాంపౌండ్ వాల్ నిర్మాణం,  కింద సీసీ రోడ్స్, జీపి బిల్డింగ్, అంగన్వాడి సెంటర్స్, వివిధ రహదారుల నిర్మాణంలో ఉన్నవి పూర్తి చెయ్యాలని అలాగే పనులు మొదలు కానివి ప్రారంభించాలని నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ కాంట్రాక్టర్ లు వేగంగా పనులు పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కె. హైమావతి  ఆదేశించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ,  15వ ఆర్థిక సంఘం కింద చేపట్టిన మేజర్ మైనర్ రిపేర్లు వేగంగా పూర్తి చెయ్యాలన్నారు.. అర్ అండ్ బి శాఖ అధికారులు చేస్తున్న రోడ్ నిర్మాణాలు పూర్తి చెయ్యాలని,హుస్నాబాద్ నుండి కొత్తపల్లి నాలుగు వరసల రోడ్ నిర్మాణంలో వేగం పెంచాలని ఆదేశించారు. మున్సిపల్ లో జంక్షన్ డెవలప్మెంట్, ఎల్లమ్మచెరువు వెళ్ళేందుకు రోడ్ నిర్మాణం, అర్చులు, సుందరీకరణ పనులు ఇతరత్ర పనులు నిర్ణిత కాలం లో పూర్తి చేయాలని ఆదేశించారు. నేషనల్ హైవే సిద్దిపేట-ఎల్కతుర్తి 85% రోడ్ పనులు పూర్తి చేశామని  పందిళ్ళ టోల్ ప్లాజా నిర్మాణం, బస్వాపూర్ ఫారెస్ట్ క్లియరెన్స్ చేసుకుని రోడ్ నిర్మాణం, రోడ్ వెంబడి గల పలు విగ్రహాల తొలగింపుకు ఆయా గ్రామాల సర్పంచ్, సెక్రటరీ లను కలిసి అందరి సమక్షంలో రోడ్లపై నుండి తొలగించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు . విద్యుత్ శాఖ ఆయా గ్రామంలో నిర్మాణంలో ఉన్న విద్యుత్ ఉప కేంద్రాల నిర్మాణం పూర్తి చెయ్యాలని తెలిపారు. గౌరవేల్లి ఆర్ అండ్ ఆర్ కాలనీలో చేపడుతున్న మిషన్ భగీరథ పనులు నిర్ణిత కాల వ్యవధిలో పూర్తి చేయాలని ఆదేశించారు. ఇందిరమ్మ ఇళ్లు నిర్మాణాలను ఆయా స్థాయిలో అధికారులు పర్యవేక్షణ చేస్తూ 100 శాతం పూర్తి అయ్యేలా చర్యలు తీసుకోవాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. ఆయిల్ ఫామ్ సాగు గూర్చి మీకు ఇచ్చిన టార్గెట్ ను తప్పనిసరిగా పూర్తి చెయ్యాలని ఉద్యానవన శాఖ అధికారులను ఆదేశించారు. గ్రామాల్లో రైతులతో సమావేశాలు నిర్వహించి ఆయిల్ ఫామ్ సాగు చేసేలా ప్రోత్సహించాలని తెలిపారు. అలాగే రైతువేదికలలో విత్తన మేళలో రైతులు సన్న వడ్లను వేసేలా అలాగే ఎక్కువ మొత్తంలో పప్పుదినుసులు, కూరగాయలు లాంటి ఆరుతడి పంటలను వేసుకునేలా ప్రోత్సహించాలని వ్యవసాయ శాఖ అధికారులు ఆదేశించారు.

🕒 25 Jun 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/development-works-should-be-completed-immediately/article-17171

Tags: