వ్యవసాయ శాఖలో సిబ్బంది కొరత
విశ్వంభర, రామన్నపేట: యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మండలంలో వ్యవసాయ శాఖలో సిబ్బంది కొరత తీవ్రంగా ఉండటంతో రైతులకు అవసరమైన సేవలు సకాలంలో అందడం లేదు. మండలంలో 40,000 ఎకరాలలో వరి తదితరు పంటలు సాగు అవుతున్నాయి. కానీ నలుగురే ఏఇఓలు ఉన్నారు. ఒకొక్కరికి పదివేలు ఎకరాలకు సంబందించిన సాగు, దిగుబడి, వ్యవసాయ సూచనలు, సలహాలు చూస్తునారు. కానీ ఒక్కో ఏఇఓకు ఉండవలసింది ఐదు వేలు ఎకరాలు మాత్రమే ఉండాలి. దీని ప్రకారం 8 ఏఇఓలు ఉండాలి. గ్రామ స్థాయిలో వ్యవసాయ అధికారులు తగిన సంఖ్యలో లేకపోవడం వల్ల రైతులకు పంటల నిర్వహణ, సాంకేతిక సలహాలు, ప్రభుత్వ పథకాలపై సరైన మార్గదర్శకత్వం అందడం కష్టమవుతోంది. ముఖ్యంగా పంటల సమస్యలు, తెగుళ్ల నివారణ, నష్టాల అంచనా వంటి అంశాల్లో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రైతుల సంక్షేమం దృష్ట్యా సరిపడా సిబ్బందిని వెంటనే భర్తీ చేసి వ్యవసాయ శాఖను బలోపేతం చేయాలని రైతులు కోరుతున్నారు.