ఓవర్ స్పీడ్ తో ఇసుక ట్రాక్టర్ ట్రాలీ బోల్తా

ఓవర్ స్పీడ్ తో ఇసుక ట్రాక్టర్ ట్రాలీ బోల్తా

విశ్వంభర, నెల్లికుదురు: ఇసుక ట్రాక్టర్లకు వేగానికి అడ్డు అదుపు లేకుండా పోతోంది. చేసేది అక్రమమైనా లీగల్ గా చేస్తున్నామన్నట్లు బిల్డప్ ఇచ్చుకుంటూ ట్రాక్టర్లను అతివేగంగా నడుపుతున్నారు. రీచ్ నుంచి ఇసుక ట్రాలీలో నింపుకొని బయటికి వెళ్లిందంటే స్పీడుకు అడ్డే లేదు. ఇసుక ట్రాక్టర్లు వస్తుంటే ఎక్కడ తాకుతుందోనని ప్రజలకు వాహనదారులకు భయం వెంటాడుతోంది. ఈ క్రమంలోనే మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం మునిగల వీడు గ్రామంలో ఆకేరు వాగు నుంచి ఇసుక నింపుకొని ఓవర్ స్పీడ్ తో వస్తూ ఎదురుగా వచ్చే ట్రాక్టర్ ను తప్పించపోయి అదుపు తప్పి గ్రామంలో బోల్తా పడింది. అక్కడే ఉన్న గ్రామస్తులు గమనించి తప్పించుకోవడంతో తృటిలో పెద్ద ప్రమాదం తప్పిందని ఊపిరి పీల్చుకున్నారు.

విచ్చలవిడిగా ఇసుక దందా 

Read More ఘనంగా వసంత పంచమి

మండలంలో విచ్చలవిడిగా ఇసుక దందా కొనసాగుతున్న పట్టించుకునే వారే లేరనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. అప్పుడప్పుడు ఒకటి రెండు రోజులు అధికారులు ప్రచారం కోసం హల్చల్ చేస్తూ తర్వాత పట్టించుకోవడమే లేదు. ఎందుకిలా చేస్తున్నారో ఎవరికీ అర్థం కావడం లేదు. ఓవైపు ప్రభుత్వం ఇసుక అక్రమ రవాణాకు పాల్పడితే సహించేది లేదని ప్రకటనలు ఇస్తున్నప్పటికీ  అందుకు  అనుగుణంగా సంబంధిత అధికారులు వ్యవహరించకపోవడంతో క్షేత్రస్థాయిలో ఆచరణలో లేకుండా పోతుందని ప్రజల నుంచి ఆగ్రహం వ్యక్తమ వుతోంది.

నెంబర్ ప్లేట్లు ఉండవ్..పట్టించుకోని ఆర్టీవో..

ఇసుక ట్రాక్టర్లకు నెంబర్ ప్లేట్ల పై నెంబర్ కనబడకుండా అక్రమ ఇసుక వ్యవహారం దర్జాగా కొనసాగిస్తున్నారు. చాలా  ట్రాక్టర్లు నెంబర్ ప్లేట్లు లేకుండానే రోడ్లపై రైయ్ రైయ్ మని తిరుగుతుంటాయి. అయినా ఆర్టీవో కన్నేసి పట్టుకున్న పాపానపోలేదు.యథేచ్ఛగా  రోడ్లపై అక్రమ ఇసుకతో ఓవర్ స్పీడ్ తో వెళ్తున్నా అటు పోలీసులు,ఇటు ఆర్టీవో,సంబంధిత అధికారులు ఎవరూ పట్టించుకోవడంలేదనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ద్విచక్ర, ఇతర వాహనాలపై ఉన్న పర్యవేక్షణ ఇల్లీగల్ గా నడిపిస్తున్న ఇసుక ట్రాక్టర్ల పై ఎందుకు కొరవడిందో అంత చిక్కడం లేదని పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.

Tags: