ప్రజల నమ్మకానికి అనుగుణంగా బడ్జెట్

ప్రజల నమ్మకానికి అనుగుణంగా బడ్జెట్

విశ్వంభర, సిద్దిపేట: ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2026బడ్జెట్ ప్రజాపాలనపై ప్రజలు పెట్టుకున్న నమ్మకానికి అనుగుణంగా ఉందని కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు అత్తు ఇమామ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని తన కార్యాలయంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఆరు గ్యారంటీల సంక్షేమం, ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్నం భోజనం, భూ భారతి చట్టం అమలు, కొత్తగా 2లక్షల మందికి పింఛన్ వైద్య విద్య, గ్రామాలాభివృద్ధికి పెద్దపీట వేశారన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో అంకెల గారడియే తప్ప రాష్ట్ర ప్రజలకు ఒరిగింది ఏమీ లేదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అంకెల్లో కాకుండా చేతల్లో చేసి చూపిస్తుందని చెప్పారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ను చూసి ప్రతిపక్షాలు ఓర్వడం లేదన్నారు. సీఎం రేవంత్ రెడ్డి లక్ష్యంతో ముందుకెళ్తున్నారని ఆయనకు ప్రజలు ఆశీర్వాదం అందజేయాలని కోరారు. మరో పదేండ్లపాటు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే రాష్ట్రంలోని అన్నివర్గాలకు సమన్యాయం జరుగుతుందన్నారు.

Tags: