గౌలిపుర డివిజన్ లో పారిశుధ్య పనులు 

గౌలిపుర డివిజన్ లో పారిశుధ్య పనులు 

విశ్వంభర, గౌలిపుర:  ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా యాకుత్ పుర నియోజకవర్గం గౌలిపుర డివిజన్ లోని కాంగ్రెస్ పార్టీ  టిపిసిసి ప్రోటోకాల్ సెక్రెటరీ,  గౌలిపురా డివిజన్ అధ్యక్షుడు అల్లం రాకేష్ ఆధ్వర్యంలో అచ్చయ్య నగర్ నగర్ ప్రాంతంలోని కమ్యూనిటీ హాల్, పరిసర ప్రాంతంలో  చెత్తాచెదారాన్ని పారిశుద్ధ్య సిబ్బంది తో పరిశుభ్రం చేయించారు. ఈ సందర్భంగా  రాకేష్ మాట్లాడుతూ, ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక (99) రోజుల ప్రణాళిక లో భాగంగా  నియోజకవర్గo ప్రాంతాల్లో వేగంగా అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో యాకత్ పుర అసెంబ్లీ ఏ బ్లాక్ ప్రెసిడెంట్ మామిడాల శ్రీనివాస్, నగర మాజీ ఉపాధ్యక్షుడు రాజు యాదవ్,  స్థానికులు, సిపిఐ గౌలిపుర డివిజన్ కార్యదర్శి చంద్రమోహన్ గౌడ్, శ్రీకాంత్ ,శివ, మరియు జిహెచ్ఎంసి అధికారులు, పారిశుద్ధ సిబ్బంది, తదితరులు  పాల్గొన్నారు.

Tags: