ప్రజల్లో పరిశుభ్రతపై అవగాహన

ప్రజల్లో పరిశుభ్రతపై అవగాహన

 విశ్వంభర,సూర్యాపేట: సూర్యాపేట పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రతి ఇంటి నుంచి చెత్తను వేర్వేరుగా వర్గీకరించి ఇవ్వాలి” అని మున్సిపల్ చైర్‌పర్సన్ మొరిశెట్టి నివేదిత లక్ష్యాది తెలిపారు.ఆదివారం స్థానిక 46వ వార్డులో ఇంటింటికీ వ్యర్థాల సేకరణ, చెత్తను సిగ్రిగేషన్ విధానంలో ఎలా అందజేస్తున్నారో ఆమె ప్రత్యక్షంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాల అమలుపై స్థానిక నివాసితులతో మాట్లాడి వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా చైర్‌పర్సన్ మాట్లాడుతూ పట్టణ పరిశుభ్రతకు ప్రజల భాగస్వామ్యం అత్యంత అవసరమన్నారు. ఇంటి వద్దే తడి, పొడి చెత్తను వేర్వేరుగా వర్గీకరించి మున్సిపల్ కార్మికులకు అందజేస్తే వ్యర్థాల నిర్వహణ సులభమవుతుందని చెప్పారు.అలాగే పర్యావరణ పరిరక్షణలో భాగంగా పరిశుభ్రతకు ప్రతి ఒక్కరూ ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా పట్టణంలోని అన్ని వార్డుల్లో పరిశుభ్రత కార్యక్రమాలను మరింత విస్తృతంగా నిర్వహిస్తామని చైర్‌పర్సన్ మొరిశెట్టి నివేదిత-లక్ష్యాది తెలిపారు.మహిళా దినోత్సవం సందర్భంగా ఛైర్మెన్ కి వార్డులోని చిన్నారి గ్రీటింగ్ కార్డు ఇచ్చి శుభాకాంక్షలు తెలియజేయడం పలువురిని ఆకట్టుకుంది.ఈ కార్యక్రమంలో ఇఇ కిరణ్ కుమార్ , సానిటరీ ఇన్స్పెక్టర్ సారగండ్ల శ్రీనివాస్  ఎన్విరాన్ మెంట్ ఇంజనీర్ శివ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Tags: