నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ పట్టివేత

నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ పట్టివేత

విశ్వంభర: జిహెచ్ యంసి: నాన్ డ్యూటి పెయిడ్ లిక్కర్ ఢిల్లీ, గోవా ప్రాంతాల నుంచి ఎయిర్ లైన్స్, రైలు ద్వారా   అక్రమంగా తెలంగాణలోకి వస్తున్న సమాచారం మేరకు దాడులు చేసి  239  మద్యం బాటిళ్లను ఎస్టీఎఫ్ టీమ్‌లు  స్వాధీనం చేసుకున్నాయి. శంషాబాద్ ఎయిర్ పోర్టు ద్వారా ఢిల్లీ, గోవా ప్రాంతాల నుంచి  మద్యం వస్తుందని సమాచారం మేరకు ఎస్టీఎఫ్ ఏ టీమ్ లీడర్ అంజిరెడ్డి సిబ్బంది కలిసి పహాడిషరీఫ్ వద్ద వాహనాల తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో 213 నాన్ డ్యూటి పెయిడ్ లిక్కర్ మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. పట్టుకున్న మద్యం బాటిళ్ల విలువ  రూ. 4.26 లక్షల విలువ ఉంటుందని అంచనా వేశారు. మద్యం బాటిళ్లను మారేడ్‌పల్లి ఎక్సైజ్ స్టేషన్‌లో అప్పగించారు. ఎస్టీఎఫ్ డి టీమ్ సీఐ నాగరాజు సిబ్బంది కలిసి సికింద్రాబాద్ రైల్వే  స్టేషన్ ప్లాట్ ఫారం 10పై ఢిల్లీ నుంచి వచ్చిన 26 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో భగవాన్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసి  మారేడ్‌పల్లి ఎక్సైజ్ స్టేషన్‌లో అప్పగించారు. పట్టుకున్న మద్యం విలువ రూ. 52 వేలు ఉంటుందని అంచనా వేశారు.

Tags: