విద్యార్థి దశలో సాహిత్యం పై మక్కువ పెంచాలి 

విద్యార్థి దశలో సాహిత్యం పై మక్కువ పెంచాలి 

  • తెలంగాణ సామాజిక రచయితల సంఘం జిల్లా అధ్యక్షుడు

విశ్వంభర, తొర్రూరు : విద్యార్థి దశలోనే  సాహిత్యం పై మక్కువ పెంచాలని తెలంగాణ సామాజిక రచయితల సంఘం జిల్లా అధ్యక్షుడుఇమ్మడి రాంబాబు చెప్పారు.  ప్రపంచ కవితా దినోత్సవాన్ని పురస్కరించుకొని  ఆయన మాట్లాడుతూ, పాఠశాల స్థాయిలో ఉన్న తెలుగు ఉపాధ్యాయులు నాగబావయుక్తంగా విద్యను బోధించినప్పుడు విద్యార్థులకు భాష పై మక్కువ పెరుగుతుందని అలాంటి బోధనలను చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. కవిత్వం అనేది మనసుకు ఉల్లాసాన్ని ఉత్సాహాన్ని ఇస్తుంది. కవిత్వం అనేది కొత్త పదాల కలయిక .కవిత్వము అజరామరం. కవిత్వంలో పట్టుంటే దేన్నైనా పట్టు విడవకుండా సాధించవచ్చునని అన్నారు . ప్రతి సంవత్సరం మార్చి 21న ప్రపంచ కవితా  దినోత్సవం నిర్వహిస్తారని, కవులకు,  భాషాభిమానులకు ప్రపంచ కవితా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

Tags: