గణేష్ గడ్డ ఆలయ ఆదాయం రూ. 27.93 లక్షలు

గణేష్ గడ్డ ఆలయ ఆదాయం రూ. 27.93 లక్షలు

విశ్వంభర, సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని ప్రసిద్ధ గణేష్ గడ్డ దేవస్థానంలో శుక్రవారం హుండీ లెక్కింపు కార్యక్రమం నిర్వహించారు. ఎండోమెంట్ ఇన్‌స్పెక్టర్ రంగారావు, ఆలయ కార్యనిర్వహణాధికారి (ఈవో) లావణ్య, దేవస్థాన కమిటీ సభ్యుల సమక్షంలో ఈ లెక్కింపు ప్రక్రియ కొనసాగింది. గత 86 రోజులకు గాను భక్తులు సమర్పించిన కానుకల వివరాలను ఈవో లావణ్య వెల్లడించారు. జనరల్ హుండీ ఆదాయం: రూ. 26,44,922, అన్నదాన హుండీ ఆదాయం: రూ. 1,48,642, మొత్తం ఆదాయం: రూ. 27,93,564. ఈ సందర్భంగా ఈవో లావణ్య మాట్లాడుతూ, భక్తులు సమర్పించిన ఈ ఆదాయాన్ని దేవస్థాన అభివృద్ధి పనులకు, భక్తులకు అవసరమైన సౌకర్యాల కల్పనకు వినియోగిస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, ఆలయ ప్రధాన అర్చకులు జె. సంతోష్, కమిటీ సభ్యులు ఎస్. చంద్రశేఖర్, జగదీష్, సతీష్, అయ్యప్ప, ఈశ్వర్, శివ కేశవ సేవా సమితి సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

Tags: