ఉగాది వేడుకల్లో పాల్గొన్న కార్పొరేటర్

ఉగాది వేడుకల్లో పాల్గొన్న కార్పొరేటర్

విశ్వంభర, హైదర్ నగర్: హైదర్ నగర్ డివిజన్ పరిధిలో పబ్లిక్ పార్కులో  కాలనీవాసులు పరాభవ నామ సంవత్సరం ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ  కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హైదర్ నగర్ డివిజన్ కార్పొరేటర్ నార్ని శ్రీనివాసరావు పాల్గొన్నారు. కాలనీవాసులు కార్పొరేటర్ ని సన్మానించి ఉగాది పచ్చడి అందించారు. కార్పొరేటర్ మాట్లాడుతూ, నియోజకవర్గ, రాష్ట్ర ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలుపుతూ ప్రజలందరూ ఆయురారోగ్యాలతో అనుకున్న పనులన్నీ నెరవేరాలని ఆ భగవంతుని మనస్పూర్తిగా వేడుకుంటున్నానని తెలిపారు.

Tags: