కార్మికుల హక్కుల కోసం కృషి లక్ష్యంగా… చేవెళ్ల లేబర్ సెల్ జనరల్ సెక్రటరీగా బానూరి శివ శంకర్ గౌడ్ నియామకం*

కార్మికుల హక్కుల కోసం కృషి లక్ష్యంగా… చేవెళ్ల లేబర్ సెల్ జనరల్ సెక్రటరీగా బానూరి శివ శంకర్ గౌడ్ నియామకం*


విశ్వంభర, చేవెళ్ల: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (లేబర్ సెల్) ఆధ్వర్యంలో చేవెళ్ల నియోజకవర్గ లేబర్ సెల్ జనరల్ సెక్రటరీగా బానూరి శివ శంకర్ గౌడ్‌ను నియమిస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ అయ్యాయి.రంగారెడ్డి జిల్లా మోయినాబాద్ మండలంలోని తోల్కట్ట గ్రామానికి చెందిన బానూరి శివ శంకర్ గౌడ్ కు ఈ బాధ్యతలు అప్పగించడం పట్ల స్థానిక నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, టెలంగాణ రాష్ట్ర INTUC ఆధ్వర్యంలో పారిశ్రామిక మరియు అసంఘటిత కార్మికులను సంఘటితం చేయడం, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయడం తన ముఖ్య లక్ష్యమని తెలిపారు. కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం చేపడుతున్న పథకాలను ప్రతి కార్మికుడికి చేరవేయడానికి కట్టుబడి పనిచేస్తానని చెప్పారు.అలాగే, రాష్ట్ర ప్రభుత్వ శాఖలు, కార్పొరేషన్లు మరియు సంబంధిత అధికారులు తమకు సహకారం అందించాలని కోరారు.ఈ నియామక పత్రంపై చేవెళ్ల నియోజకవర్గ లేబర్ సెల్ అధ్యక్షుడు సయ్యద్ వసీమ్ అహ్మద్ సంతకం చేశారు.

Tags: