వెల్లంకిలో ఘనంగా బ్రహ్మోత్సవాలు 

వెల్లంకిలో ఘనంగా బ్రహ్మోత్సవాలు 

విశ్వంభర, రామన్నపేట: యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మండలం, వెల్లంకి గ్రామంలో శ్రీపార్వతి శంభులింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా సోమవారం  రాత్రి పార్వతి అమ్మవారికి, శంభులింగేశ్వర స్వామికి ఘనంగా కళ్యాణం నిర్వాహించారు. స్వామి వారికి వెల్లంకి గ్రామ సర్పంచ్ ఈడెం రాధా శ్రీనివాస్ ఇంటి నుండి ఊరేగింపుగా వచ్చి తలంబ్రాలు, పట్టు వస్త్రాలు సమర్పించారు. వెల్లంకి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదివిన 2001-02 పదవ తరగతి బ్యాచ్ పూర్వ విద్యార్ధులు బ్రహ్మోత్సవాల సందర్భంగా అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అనంతరం జంగిరెడ్డి బృందం వారిచే సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ మహిళలు, ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ జిల్లా నాయకులు ఎడ్ల శిల్ప - మహేందర్ రెడ్డి దంపతులు, గ్రామ సర్పంచ్ ఇడెం రాధా - శ్రీనివాస్ దంపతులు, ఉప-సర్పంచ్ మిర్యాల రాజకుమార్, మాజీ సర్పంచులు, మాజీ ఎంపిటిసిలు, వార్డు సభ్యులు, బిఆర్ఎస్ పార్టీ అద్యక్ష, కార్యదర్శులు, దేవాలయ కమిటి చైర్మన్ వనం సత్తయ్య, గ్రామంలోని అన్ని పార్టీల నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Tags: