పాఠశాలల్లో రంజాన్ వేడుకలు 

పాఠశాలల్లో రంజాన్ వేడుకలు 

విశ్వంభర, ఇనుగుర్తి: మండల కేంద్రం ఇనుగుర్తి లోని వాగ్దేవి కాన్సెప్ట్ స్కూల్,విజ్ఞాన్ హై స్కూల్ లలో ముందస్తుగా శుక్రవారం రంజాన్ వేడుక జరుపుకున్నారు. హిందూ,ముస్లింలకు చెందిన బాల,బాలికలు ఈద్ ముబారక్ అంటూ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ సందర్భంగా వాగ్దేవి స్కూల్ కరస్పాండెంట్ కట్టయ్య, విజ్ఞాన్ హై స్కూల్ హెచ్ఎం అర్చనా రెడ్డి ఆయా పాఠశాలల్లోని స్టూడెంట్స్ కు రంజాన్ పండుగ విశిష్టతను వివరించారు. నెల రోజులపాటు అల్లానామస్మరణలో ఉపవాస దీక్ష రోజాలో ఉంటూ రంజాన్ పండుగ జరుపుకోవడం వారి కఠోర దీక్ష ప్రేమ,శాంతి,సహనాలకు నిదర్శనమ న్నారు.వాగ్దేవిలో బురకా తరహాలో ధరించి అలైబలై తీసుకోగా, విజ్ఞాన్ లో స్టూడెంట్ ఎండి అనాస్ తోటి విద్యార్థులకు,ఉపాధ్యాయులకు పాయసాన్ని అందించాడు.ఈ కార్యక్రమంలో వాగ్దేవిలో టీచర్స్ శిరీష,అప్సర,నవ్య,షాహిన్, రజిని,సులోచన, విజ్ఞాన్ లో చంద్రమోహన్, తోట అనిత, పింగిలి రమాదేవి, కారం పూరి  అనూష, ఉడుత శ్వేత, కదిర రమ్య, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Tags: