సి.సి.రోడ్డు పనులకు శంకుస్థాపన
On
విశ్వంభర, సూర్యాపేట: చివ్వేంల మండలంలోని గుంజలూరు గ్రామంలో సీసీ రోడ్డు పనులకు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశ పెడుతుందని తెలిపారు. ప్రతి గ్రామంలో సీసీ రోడ్ల నిర్మాణ పనులను చేపడుతున్నట్లు చెప్పారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బొల్లికొండ, ఉపసర్పంచ్ దొనకొండ పావని, వార్డు సభ్యులు కొప్పు సైదులు, కొనకంచి మల్లయ్య, బొల్లికొండ దుర్గయ్య, పెదపోలు చందన, మోలుగురి శ్రావణి, గ్రామ శాఖ అధ్యక్షుడు దొనకొండ శ్రీనివాస్, మున్సిపల్ కౌన్సిలర్ కొండపల్లి దిలీప్ రెడ్డి, శ్రీ దండు మైసమ్మ దేవస్థానం చైర్మన్ తంగేళ్ళ కరుణాకర్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ నాయకులు మద్దెబోయిన శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.



