డిసిసి ప్రధాన కార్యదర్శిగా మహేందర్ రెడ్డి

డిసిసి ప్రధాన కార్యదర్శిగా మహేందర్ రెడ్డి

విశ్వంభర, రామన్నపేట: యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మండలంలోని వెల్లంకి గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ తిమ్మాపురం మహేందర్ రెడ్డి యాదాద్రి భువనగిరి జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. గురువారం టీపీసీసీ అధ్యక్షుడు బి.మహేష్ కుమార్ గౌడ్ ప్రకటించిన డిసిసి కమిటీలో తిమ్మాపురం మహేందర్ రెడ్డికి ప్రధాన కార్యదర్శిగా అవకాశం దక్కింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పార్టీ అభివృద్ధికై కృషి చేస్తానని తెలిపారు. నియామకానికి సహకరించిన ఎంపి చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యేలు వేముల వీరేశం, బీర్ల ఐలయ్య, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు సిరిగిరెడ్డి మల్లారెడ్డి, జిల్లా నాయకుడు గంగుల వెంకట్ రాజిరెడ్డి లకు కృతజ్ఞతలు తెలిపారు.

Tags: