త్రిణయ ఆరోగ్య కేంద్రం ప్రారంభం
విశ్వంభర, హైదరాబాద్ : బంజారా హిల్స్‌లోని హుడా రెసిడెన్షియల్ కాంప్లెక్స్‌లో ఏర్పాటు చేసిన త్రిణయ ఆరోగ్య కేంద్రాన్ని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే వల్లాల నవీన్ యాదవ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి గౌరవ అతిథిగా రాష్ట్ర ఆరోగ్య, వైద్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ హాజరుకాగా, ఆర్య వైద్యశాల మేనేజింగ్ ట్రస్టీ డా. పి.ఎం. వారియర్, ప్రధాన కార్యనిర్వాహక అధికారి కె. హరికుమార్, డా. కె. మురళీధరన్, ఆయుర్వేద ఆసుపత్రి పరిశోధనా కేంద్రం సూపరింటెండెంట్ మనోహర్ బండ్ల, వై యు పి రైట్‌కేర్ ప్రతినిధి పి.ఎస్. వరప్రసాద్ పాల్గొన్నారు. చర్మం, కేశ సంరక్షణలో కూడా ప్రామాణిక ఆయుర్వేద చికిత్సలు అందించడం ఈ కేంద్రం ప్రత్యేకత అని.. సంప్రదాయం, శాస్త్రీయ విధానం, ఆధునిక సదుపాయాల సమ్మేళనంతో పట్టణ ప్రజలకు సమగ్ర ఆరోగ్య పరిష్కారాలను అందించడమే ప్రధాన ఉద్దేశమని మేనేజింగ్ ట్రస్టీ డా. పి.ఎం. వారియర్ అని తెలిపారు. హైదరాబాద్‌లో త్రిణయ కేంద్రం ప్రారంభం ద్వారా ఆయుర్వేద సంప్రదాయాన్ని మరింత విస్తరించి, సమకాలీన అవసరాలకు అనుగుణంగా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడంలో వైద్యశాల మరో ముందడుగు వేసిందన్నారు.



