ఉగాది పండుగ శుభాకాంక్షలు. - బిజెపి యువ నాయకులు డా. వైభవ్ రెడ్డి
On
విశ్వంభర, చేవెళ్ల:తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు చేవెళ్ల నియోజకవర్గం బిజెపి యువ నాయకులు డాక్టర్ వైభవ్ రెడ్డి. ఉగాది నూతన సంవత్సరానికి నాంది పలుకుతూ ప్రతి ఇంటా సంతోషం, శాంతి, సంపదలు నెలకొనాలని ఆకాంక్షించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఉగాది పండుగ మన సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అని పేర్కొన్నారు. ప్రజలు కొత్త ఆశయాలతో ముందుకు సాగుతూ అభివృద్ధి దిశగా అడుగులు వేయాలని కోరారు.అలాగే, ప్రతి కుటుంబంలో ఆనందాలు వెల్లివిరియాలని, రాష్ట్రం అభివృద్ధి పథంలో మరింత ముందుకు సాగాలని ఆకాంక్షించారు.



