నీలం శేఖర్ కు ఉగాది పురస్కారం
విశ్వంభర, రామన్నపేట: యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మండలం, ఎన్నారం గ్రామంలోని ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జీవశాస్త్ర ఉపాధ్యాయులుగా విధులు నిర్వహిస్తున్న నీలం శేఖర్ కు ఉపాధ్యాయులలో సామాజిక సేవకి గుర్తింపుగా ఉగాది విశిష్ట సేవ పురస్కారాలలో మానవతా సేవా సారథి అవార్డు అందుకున్నారు. హైదరాబాద్ లోని కళావేదిక ప్రాంగణంలో ప్రాగ్నిక ఆర్ట్స్ అకాడమీ, గంగోత్రి కల్చరల్ ఫౌండేషన్ సంస్థ వ్యవస్థపాక అధ్యక్షులు ప్రవీణ్, పారిజాత ఉమ్మడి తెలుగు రాష్టాలో ఉపాధ్యాయులలో ముగ్గురిని గుర్తించి వారికి అవార్డు అందించి సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్ట్ యూనియన్ నాయకులు, సినీ గాయకులు, వివిధ రంగాల నుండి ప్రముఖులు పాల్గొన్నారు. అనంతరం రామన్నపేట మండల వాసికి ఈ అవార్డు రావడంపై ఎంఈఓ గవ్వ జ్యోతి, ఉపాధ్యాయులు దొడ్డి స్వామి, శేఖర్, సురేందర్ రెడ్డి, బాసరాజు యాదగిరి, మట్టారెడ్డి, తీగల జాన్ రెడ్డి, కమలాదేవి, భవాని, సీనారెడ్డి, మణి, సైదులు, రవి, కుమారస్వామి, మధుబాబు తదితరులు అభినందనలు తెలిపారు.



