పట్నంశెట్టికి మాజీ ఎంపీ పరామర్శ
On
విశ్వంభర, నెల్లికుదురు: మండలంలోని మునగలవీడు గ్రామానికి చెందిన విశ్రాంత ఉపాధ్యాయులు కొలగాని రాజయ్య ఇటీవల మృతిచెందారు. విషయం తెలుసుకున్న మాజీ ఎంపీ, బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు మాలోతు కవిత శుక్రవారం సంబంధిత గ్రామానికి వెళ్లి స్వర్గీయ రాజయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆయన కుమారుడు, మాజీ సర్పంచ్ పట్నంశెట్టి నాగరాజును, కుటుంబ సభ్యులను పరామర్శించారు. సమాజ నిర్మాత అయిన రిటైర్డ్ ఉపాధ్యాయుడు రాజయ్య కన్నుమూత బాధాకరమన్నారు. ఆమె వెంట నాయకులు ముత్యం వెంకన్న గౌడ్,మహబూబ్ పాషా,నవీన్ రావు,సూర్యప్రకాష్ నాయక్,ఉపసర్పంచి మల్లయ్య, బుగ్గ దేవేందర్,లింగయ్య, బిక్షం రెడ్డి తదితరులు ఉన్నారు.



