రాష్ట్ర బడ్జెట్ లో నిరుద్యోగులకు నిరాశే

రాష్ట్ర బడ్జెట్ లో నిరుద్యోగులకు నిరాశే

  • నిరుద్యోగుల ఫోరం అధ్యక్షుడు అనుజ్ కుమార్

విశ్వంభర, హైదరాబాద్: నిరుద్యోగుల ఆశలపై కాంగ్రెస్  సర్కారు మరోసారి నీళ్లు చల్లిందని, బడ్జెట్ లో నిరుద్యోగ భృతికి ఒక్క రూపాయి కూడా కేటాయించకుండా నిరాశ మిగిల్చారని  నిరుద్యోగుల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు అనుజ్ కుమార్ మండిపడ్డారు. బడ్జెట్ లో ఉద్యోగాల భర్తీ ఊసే ఎత్త లేదనీ, 2023 ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన నిరుద్యోగ భృతి, రెండు లక్షల ఉద్యోగాలు, జాబ్ క్యాలెండర్,  వాటి హామీలను పూర్తిగా విస్మరించిందని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలోని నిరుద్యోగ యువతకు రాహుల్ గాంధీ ఇచ్చిన ప్రధాన హామీలలో మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయడం, నెలవారీ నిరుద్యోగ భృతి 4 వేలు అందించడం, జాబ్ క్యాలెండర్‌ను ప్రారంభిస్తామని చెప్పి నేటికీ అమలు చేయడం లేదన్నారు. యూత్ కమిషన్‌ను ఏర్పాటు, 10 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు అందించాలని అన్నారు. తమ ప్రభుత్వం రెండేళ్లలో దాదాపు 70 వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసిందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించడం హాస్యాస్పదం అన్నారు. జీవో నెం. 8, 544 లకు సవరణలు చేయాలనీ,  అన్ని నియామకాలలో డౌన్‌మెరిట్ జాబితాను అనుసరించాలన్నారు. తద్వారా నిరుద్యోగ సమస్యలు పరిష్కారమవుతాయన్నారు. ప్రైవేట్ రంగాలలో స్థానిక రిజర్వేషన్లను 95 శాతం తప్పనిసరిగా అమలు చేయాలనీ, కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని విజ్ఞప్తి చేశారు.

Tags: