బాధిత కుటుంబానికి రూ.50 వేలు ఆర్థిక సహాయం
On
విశ్వంభర, గుండాల: యాదాద్రి జిల్లా గుండాల మండలంలోని రామవరం గ్రామం లో గుజ్జ మాధవి రేషన్ డీలర్ భర్త గుజ్జ దశరథ మృతిచెందడంతో వారి కుటుంబానికి యాదాద్రి జిల్లా రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం 50వేల రూపాయల ఆర్థిక సహాయం అందేజేసింది.. ఈ కార్యక్రమంలో యాదాద్రి జిల్లా అధ్యక్షులు వెలగల రాజన్న, జిల్లా ప్రధాన కార్యదర్శి కొయ్యలగూడెం వెంకటేశం, ఉపాధ్యక్షులు సుర్వి వెంకటేష్ గౌడ్, జిల్లా కోశాధికారి ఎడ్ల దర్శన్ రెడ్డి, మోత్కూర్ ఐఎంజి అధ్యక్షులు సైదులు, భువనగిరి మండల అధ్యక్షులు మహేష్ , గుండాల అధ్యక్షులు హరి కిషన్ , ఉపాధ్యక్షులు అంజయ్య, జిల్లా కార్యవర్గ సభ్యులు రాపోలు సరస్వతి అశోక్, సువర్ణ నర్సిరెడ్డి , మోత్కూర్ ప్రధాన కార్యదర్శి సునిత శ్రీనివాస్, ఆలేరు మండల అధ్యక్షులు దూడల రోశయ్య, నరసింహ, రేషన్ డీలర్లు స్వామి, పురుషోత్తం, నాగేష్ వివిధ రేషన్ డీలర్లు పాల్గొన్నారు.



