మాజీ నక్సలైట్ నేత చేరిక

మాజీ నక్సలైట్ నేత చేరిక

విశ్వంభర, బాగ్ లింగంపల్లి: బుల్లెట్ మార్గం విడిచి బ్యాలెట్ ద్వారా అట్టడుగు వర్గాలకు అధికారంలో స్థానం కల్పించాలని బీసీ రాజ్యాధికార సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు దాసు సురేశ్ పిలుపునిచ్చారు. హైదరాబాదు బాగ్ లింగంపల్లిలో బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో మాజీ నక్సలైట్ల సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షుడు బోరన్నగారి సుభాష్ చంద్రబోస్ సమితిలో చేరారు. ఈ సందర్భంగా సమసమాజ స్థాపనకు ప్రజాస్వామ్య పద్దతే  సరైన మార్గమని పేర్కొన్నారు. మావోయిస్టులు బ్యాలెట్ బాట పట్టడం శుభ పరిణామమని, అట్టడుగు వర్గాల సాధికారత కోసం స్వతంత్ర రాజకీయ వేదిక అవసరమని తెలిపారు. సభ్యత్వం స్వీకరించిన అనంతరం మాట్లాడిన బోరన్నగారి సుభాష్ చంద్రబోస్ బీసీల హక్కుల కోసం కొనసాగుతున్న పోరాటాన్ని బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. రాజకీయ వ్యవస్థలో సముచిత ప్రాతినిధ్యం కోసం ఐక్యంగా ముందుకు రావాలని సూచించారు. కార్యక్రమంలో సమితి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Tags: